ఉత్తరాయణం

రాజాంలో సమస్యల తిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రజాసమస్యలు దశాబ్దకాలంగా పడకేసాయి. ము ఖ్యంగా రాజాం-నగర పంచాయితీ పరిధిలో ఆర్. టి.సి. కాంప్లెక్సుల్లో సమస్యలు తిష్టవేసాయి. కాస్త వర్షానికే ద మ్ము మడిని తలపిస్తోంది. ప్రయాణికులు త్రాగేందుకు స్వచ్ఛమైన త్రాగేనీరు అందించే దాఖలాలులేవు. ఇక రా జాం మెయిన్‌రోడ్డు విస్తరణకాక నిత్యం చాలా ట్రాఫిక్ సమస్యలు ప్రజల్ని ఇబ్బంది కల్గిస్తుంది. రాజాం సామాజికాసుపత్రి స్థాయి పెంచినట్లు ఆదేశాలిచ్చిన గత ప్రభు త్వం, ఆ దిశగా ప్రయత్నాల్ని మరచింది. ఇటు రాజకీయ నాయకులు అటు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూ పాల్సి ఉంది. రాజాం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి.
- మూల శ్రీనివాసరావు, శ్రీకాకుళం
ఓటు బ్యాంకు రాజకీయం
దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ దేశానికి కీడు తలపెడుతున్నారు. కులంకోసం కొన్ని రాజకీయ పార్టీలు, మతంకోసం కొన్ని రాజకీయ పార్టీలు ‘‘ఓటు బ్యాంకుకై వాడుకుంటున్నాయి. ఓటు బ్యాంకుకై వివిధ వేషాలు వేస్తున్నారు. వేయించుకుంటున్నారు. తీవ్రవాద సంస్థలు భారతదేశంలో విధ్వంసాలు సృష్టించాలని ఇస్లాం తీవ్రవాదులతో చేతులు కలుపుతున్నాయి. ఇది తెలిసి కూడా ఒక మతం వారితో ఓటు బ్యాంకుకు పాల్పడుతూ, ఆ తెగకు ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా ప్రజలకు ఇవ్వడం లేదు. దేశ ప్రజలందరు ప్రజాస్వామ్య దేశంలో సమానమే! కాని చట్టాలు సమానం చే యటం లేదు. కామన్ సివిల్‌కోడ్ తప్పనిసరి అని ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు ఎందుకు చెప్పటం లేదు. ‘మానవాధారిత రాజ్యాంగమే దేశానికి కావాలని ఎందుకు ప్రతిపాదించటం లేదు. విభజించి పాలించాలనే బ్రిటీషువారి సిద్ధాంతాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ, దేశానికి కీడు తలపెడుతున్నారు. ఓటు బ్యాంకుకై ఎన్నో నాటకాలు, వేషాలు వేస్తూ, వేషాలు వేయించుకుంటూ తమనుతామే కించపరచుకోవటమేగాక, ఇతరులు నవ్వుకుంటున్నారనేది గ్రహించటం లేదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ పద్ధతులు మార్చుకొని, సహజంగా మసలుకుంటే మీకే గాదు, దేశానికే గౌరవము. అలాగాకపోతే రాబోయే రోజుల్లో ఆ రాజకీయ పార్టీలు అప్రతిష్టపాలుకాక తప్ప దు. ఇప్పటికైనా ‘ఓటు బ్యాంకు’ రాజకీయాలకు స్వస్తిచె ప్పి, దేశానికి గౌరవం తీసుకొని వస్తారని ఆశిద్దాము.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
సర్దుకు పోవాలి
ఎండకు వానకు అన్నివేళలా హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో టోపీల వ్యాపారులకు దెబ్బఅని వాపోవడం తగదు. హెల్మెట్ అన్నివేళలా కాదు, బైక్ నడుపుతున్నప్పుడు మాత్రమే. యాక్సిడెంట్ అయితే తలకు రక్ష అని దాని వాడకం తప్పనిసరిచేశారు. హెల్మెట్లవల్లనే జుట్టు రాలిపోతుందనడమూ సరికాదు. హెల్మెట్ వాడకపోయినా రాలే జుట్టు రాలిపోతుంది. కొత్త వస్తువులు, పరికరాలు వచ్చినప్పుడు పాతవి తెరమరుగు అవడం సహజం. సైకిల్, రేడియో, టేప్‌రికార్డర్ లాంటివి అమ్మేవారు, రిపేర్ చేసేవారు చాలా తక్కువమంది కనిపిస్తున్నారు. రిపేర్ చేసేవారు ఉపాధి కోల్పోయారు. మార్పు సహజం మనమే సర్దుకుపోవాలి.
- సత్య, కరప