ఉత్తరాయణం

న్యాయంగా నీటి పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీ జలాల పంపిణీ వ్యవహారంలో నీరు, ప్రజల మధ్య నిప్పుని రాజేయడం, సమాజంలో అశాంతికి ఆజ్యం పోయడం మామూలైంది. ఇది గడచిన శతాబ్ద కాలంగా జరుగుతున్నదే. అయతే నేటికీ ఇదే స్థితి కొన సాగుతుండటం పాలనా వైఫల్యం. ఇరు రాష్ట్రాలకూ ప్ర త్యేకించి ఎగువ రాష్ట్రం శాంతి భద్రతల పేరుతో తన ఆదే శాన్ని ఖాతరు చేయకపోవడాన్ని సహించబోమని అత్యు న్నత న్యాయస్థానం చెప్పడం అభినందనీయం. అయతే ఇలాంటి సున్నితమైన సమస్యలకు రాజకీయ పరిష్కారం సాధించడం దుర్లభం. ఆయా ప్రాంతాల ఉద్వేగాలకు వ్య తిరేకంగా, న్యాయంగా పక్షపాత రహితంగా మాట్లాడే సా హసం చేసి ఒకరికి దూరమయ్యే పరిస్థితికి దూరంగా ఉండాలని కేంద్రం భావిస్తున్నది. న్యాయస్థానం ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయ తప్ప రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలకు పూచీ పడలేవు. ఈ ఉదంతం నుండి దేశం నేర్చుకోవలసిన పాఠం ఒక్కటే. రానున్న దుర్బిక్షకాలంలో వివిధ ప్రాంతాల మధ్య నదీ జలాలకై కలహాలు తప్పవు. ఈ దుస్థితి నివారించేలా పకడ్బందీగా వ్యవహరించాలి. నదీ పరివాహక ప్రాంతా లలో వివాదాలు తలెత్తకుండా నీటి పంపిణీ న్యాయంగా జరిగేలా చూడాలి. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకొని కేంద్రం కార్యచరణ సూత్రాలను, హక్కులను స్పష్టంగా నిర్వచించాలి. అందుకు అంతా కట్టుబడేలా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి.
- డివిజి శంకరరావు, పార్వతీపురం
నేరస్థునికి శిక్ష పడాల్సిందే
ఎన్నికలలో అభ్యర్థి కోట్లు ఖర్చుపెట్టి గెలిస్తే- తిరిగి సంపాదించుకోవాలనే యావ లేకుండా ఎలా వుంటాడ నేది మామూలుగా వినిపించే మాట. దానికి జనం అలవాటు పడ్డారు. వీలైనంతవరకు మొత్తం ఎన్నిక రద్దు చేయడం వుండదు. చాలా సరళవైఖరి వుంటుంది. విధులు నిర్వహించే వుద్యోగి విషయంలోనూ ఉదారంగా ఏ ప్రభుత్వమైనా వుంటుంది. ఎంసెట్‌లో యాభై కోట్లు ఖర్చైపోవడం క్షమార్హం కాని నేరం. నేరస్థులకు శిక్ష పడాలి. నిర్దోషులకు ఏ కొంచెం అన్యాయం జరిగినా న్యాయానికి అన్యాయం జరిపినట్లే.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
తప్పుడు విధానాలు
నెహ్రూ కాశ్మీర్ తన స్వంత అంశంగా వ్యవహరించారు. ఇప్పుడు కొందరు ముస్లిం నాయకులు దీనికి అణుయుద్ధమే పరిష్కారం అని పాకిస్తాన్‌లో అంటున్నారు. నెహ్రూ లౌకికం పదం కూడా దేశాన్ని మున్ముందు ప్రమాదాల పాలు చేయవచ్చు. ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా పరిణమించింది. లౌకికం అంటూ పాశ్చాత్య దేశాల నుండి మతపరంగా సొమ్ము ఎందుకు రానివ్వాలి? ఆంతరంగికంగా లౌకికం, బాహ్యంగా మత పరమన్న మాట మతపరంగా మైనారిటీ ఏమిటి? పార్లమెంటులో ఈ ప్రమాదాలు చర్చకి రావు. నెహ్రూ తప్పుడు విధానాలను సరిచేయకపోతే, దేశ భవిష్యత్తు అయోమయమే.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం
అవాంఛనీయ ధోరణి
సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాలను కించపరిచే విధంగా కొన్ని తెలుగు టీవీ ఛానళ్ళు కుటుంబ న్యాయస్థానాల పాత్ర వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రకం లైవ్‌షోలకు సినీ తారల న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ చేస్తున్న వ్యాఖ్యానాలు, చీదరింపులు దాంపత్య వివాదాలు తీర్చుకోటానికి వచ్చిన భార్యాభర్తల వ్యక్తిత్వాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యతతో సతమతవౌతున్న వ్యక్తులకు ఆత్మగౌరవం వుండదన్న అహంకార ధోరణితో లైవ్‌షోల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి అవాంఛనీయం. అందరూ గర్హించి తీరాలి. ఇకపోతే, ఇటువంటి లైవ్‌షోలలో పాల్గొంటున్న అమాయకుల దాంపత్య వివాదాలను పరిష్కరించినట్లు రాయించిన అంగీకార పత్రాలకు, తీర్పులకు న్యాయబద్ధత వుందా?
- టి.యస్.రావు, చెన్నయ్
దీర్ఘకాలిక సెలవులు ఎందుకు?
మన దేశంలో పనిచేయడం తక్కువ సెలవులు తీసుకోవడం ఎక్కువ. ఏ దేశంలో లేనన్ని సెలవులు మన భారతదేశంలోవున్నాయి. అవన్నీ ఒక ఎత్తు దీర్ఘకాలిక సెలవులు మరొక ఎత్తు. ఎవరైనా ఆరోగ్యం బాగులేనపుడు సెలవు పెట్టడం తప్పనిసరి. కాని కావాలని నెలలకొద్దీ అధికారులు దీర్ఘకాలిక సెలవులలో వెళ్ళడంలోగల ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్ధంకాదు. ఎక్కువ ప్రభుత్వ అధికారులే ఈ దీర్ఘకాలిక సెలవులలో పనికి ఎగనామం పెట్టి వెళ్తుంటారు. నిజానికసలు దీర్ఘకాలిక సెలవులు అనేది ఆరోగ్యం చెడినపుడు తప్ప ఇతరత్రా ఇవ్వకూడదు..
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్