ఉత్తరాయణం

‘ఎయిడెడ్’ బోధకుల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా మన రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగుతూ, అటు ప్రభుత్వ పాఠశాలలకు, ఇటు కార్పొరేటు విద్యాసంస్థలకు దీటుగా పనిచేయడం విశేషం. ఈ పాఠశాలల్లో వున్నత విద్యాప్రమాణాలతో, శిక్షణ పొందిన విద్యాబోధకులు అనేక సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేయడం గమనార్హం. కాని వీరి వేతనాలు మాత్రం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా లేకపోవడం విచారకరం. చాలా పాఠశాలల్లో అనేక సంవత్సరాలుగా వీరి సర్వీసులు క్రమబద్దీకరణకు నోచుకోక, చాలీచాలని వేతనాలతో పలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వీరి జీత భత్యాలు, ప్రభుత్వం ఇచ్చే నిధుల సహాయానుసారం ఆయా పాఠశాల యాజమాన్యాల దయాదాక్షిణ్యా లపై ఆధారపడం కడు శోచనీయం. కనుక ప్రభుత్వం ఈ పాఠశాలలకు పుష్కలంగా నిధులు సహాయం అందించి, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలను ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా పెంచి, విద్యాసంస్థల ప్రగతికి తోడ్పడాలి.
- కె.దుర్గ్భావాని, హైదరాబాద్
పాలక వర్గాన్ని నియమించాలి!
నవీన ఆంధ్రప్రదేశ్ అవతరించి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంతవరకు అధికార భాషా సంఘానికి పాలకవర్గాన్ని నియమించక పోవడం బాధాకరం. వాస్తవానికి 2015 ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సి.ఎం. చంద్రబాబునాయుడు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా జాతీయ తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణను నియమిస్తునట్టు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఏడాది గడిచినా ఆయనకు ఎలాంటి అధికార పగ్గాలు అప్పగించలేదు. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీకాలేదు. పాలకవర్గ సభ్యుల పేర్లను కూడా ప్రకటించలేదు. తెలుగు భాషా వికాసానికి గత దశాబ్దకాలం నుంచి ఆయన ఎనలేని సేవలందిస్తున్నారు. అమరావతి రాజధాని, గోదావరి, కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో కవితా ఉత్సవాలను నిర్వహించారు. అంతర్వేదిలో ప్రపంచ కవితోత్సవంలో కీలక పాత్రను పోషించారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి తెలుగును వెలుగుబాటలోకి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎం గతంలో ప్రకటించిన మేరకు ఇందుకు సంబంధించిన జివోను వెంటనే విడుదల చేస్తే తెలుగు భాషా ప్రియులు హర్షిస్తారు.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
గాంధీజీ కోర్కె నెరవేర్చాలి
శతాధిక వయోవృద్ధ కాంగ్రెస్ గొప్పతనం అర్థం చేసుకోవటానికి సామాన్యులకు సాధ్యంకాదు. డెబ్భై ఏళ్ళుగా పాక్ ఆక్రమించిన కాశ్మీరాన్ని పిఓకె అన్న పేరుతో పిలిచిన ప్రభుత్వాలలో కాంగ్రెస్ పాలనే అత్యధికంగా నమోదైంది. ఈరోజున దిగ్విజయ్ భారత్ ఆక్రమిత కాశ్మీర్ అనేశాడు. చిదంబరం, ఖుర్షీద్ అహ్మద్‌లూ దేశ ద్రోహ పూర్వక వ్యా ఖ్యలు చేయడం ఒక ఎత్తయితే వారి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని పార్టీ వ్యాఖ్యానిస్తోంది. సం బంధం లేని వారిని పార్టీనుంచి సాగనంపమని ప్రజ అడగలేదనే నమ్మకం. యువ ఓటర్లు విద్యావంతులు ఓటుతో వస్తున్నారు. కాంగ్రెస్‌ను రద్దుచేసి గాంధీజీ ఆశయం సత్వరమే నెరవేర్చాలి.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
సమైక్యతకు విఘాతం
ఒకప్రక్క పాకిస్తాన్ మన దేశంలోని ఢిల్లీ ఇతర ముఖ్య పట్టణాలకు నిమిషాల్లో అణుబాంబుతో ధ్వంసం చేయగలదని బెదిరిస్తుంటే మన రాజకీయ నాయకులు కొందరు వీళ్లను పట్టించుకోకుండా తమ స్వార్థంకోసం సమ్మెలను, ఇతర విచ్ఛిన్న ఉద్యమాలను లేవదిస్తూ పాలకులను ఎంతో ఆందోళన పాలు చేస్తున్నారు. ఇలా కొనసాగితే దేశం బలహీనమై ప్రమాదాల పాలుకావచ్చు. దేశ భద్రతకే ముప్పురావచ్చు. స్వతంత్ర సమరంలో ఉన్న సఖ్యత, త్యాగభావం కోల్పోయినాం. రాజకీయ నాయకులకు పదవులే ముఖ్యం. దేశం కాదు. మరోప్రక్క కొందరు చర్చీలవారు మన దేశంలో ఏసురాజ్యం, బైబిలు శాసనం రావాలని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో ఇవి చర్చకు రావు. చాలామంది ప్రజాప్రతినిధులు చర్చీలవారి ఆధీనంలో వున్నారు. ఇట్లు కొనసాగితే, తిరిగి పాశ్చాత్య పాలన పాలు అవుతాము. మన రాజ్యాంగ శాసనానికి దేశ సమైక్యతకు, స్వతంత్రతకీ తిలోదకాలు కావచ్చు.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం