ఉత్తరాయణం

సోదరి నివేదితకు స్మారకం నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలకత్తాలో మదర్ థెరెస్సాకు స్మారకం ఏర్పాటు చేశారు బాగానే ఉంది. ఆమె చేసిన సేవకు తగిన గౌరవం ఇవ్వడం కొనియాడదగిందే. అయతే వివేకానందుని బోధనలకు ప్రభావితమై ఆయన శిష్యురాలిగా మారిన సోదరి నివేదితను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆమె భారతీయులకు సేవ చేయాలని నిశ్చయంచుకుంది. వివేకానందుని ఆదేశాల మేరకు కలకత్తా ప్రజలకు సన్యాసినిగా సేవలందించింది. ఆడ పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించింది. స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించింది. తోపుడుబండిలో స్వదేశీ పుస్తకాలను ఉంచి వీధివీధినా తిరిగి అమ్మింది. ఆమెకు స్వదేశీ క్రీడలంటే బహు ఇష్టం. నాగ్‌పూర్‌లో అటువంటి క్రీడలను నిర్వహించింది. అటువంటి నిస్వార్ధ సేవిక సోదరి నివేదితకు స్మారకం నిర్మించాలి.
- కె. నారాయణ, నంద్యాల
మెతకవైఖరి తగదు
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పాకిస్తాన్ ఎన్ని రాజకీయ ఎత్తుగడలను వేసినా వాటినన్నింటిని వ మ్ము చేయాలి. కశ్మీర్‌లో అల్లర్లకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. పాక్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశిస్తే వెంటనే కూల్చేయాలి. పాక్ విష యంలో మెతకవైఖరి ఎంతమాత్రం తగదు. పాక్ ఆక్ర మిత కశ్మీర్ నుంచి 36,348 కుటుంబాలు కశ్మీర్‌కు తరలి వచ్చాయ. వారికి కేంద్రం సముచిత ప్యాకేజీ ప్రకటించడం ముదావహమైన చర్య.
-ఆదా వెంకటసుబ్బన్న, మైదుకూరు
నిలిచిన ఉద్యోగ ప్రకటనలు
జిల్లా విభజన పేరుతో ఉద్యోగ ప్రకటనలను ఆపివేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. జోన్‌ల పేరుతో, రెవెన్యూ డివిజన్ల పేరుతోకాలయాపన చేస్తూ నిరుద్యోగులను ఎప్పటికప్పుడు మభ్యపెడుతున్నారు. కేసిఆర్ ప్రభుత్వ హయాంలో కొలువులు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఒక పక్క జిల్లాల విభజనపై ఆందోళనలు, మరోపక్క కోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప నోటిఫికేషన్లు వేయరల్లే ఉంది.
- అయనం రఘురామారావు, ఖమ్మం
అనాథ బాలలకు ఆసరా ఇవ్వాలి
మనం నగరాలు, పట్టణాలు, గ్రామాలలో కూడ అనాధ బాలబాలికలను నిత్యం అడుక్కుంటూనో భుజాన సంచీ తగిలిం చుకొని చెత్తకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుం టుండగా చూస్తుంటాం. వీరు ఐదు సంవత్సరాలు పైబడి చింపిరి జుత్తుతో చిరిగిన వ్రస్తాలతో ఆలనా పాలనా లేక నా అన్నవాళ్లు లేక గుంపులుగా పేవ్‌మెంట్లపై, రైల్వే, బ స్టాండ్లలో, ఫ్లై ఓవర్లు, చెట్ల కింద జీవచ్ఛవాలుగా బ్రతు కీడుస్తుంటారు. వారిలో కొందరికి తమ తల్లిదండ్రు లెవ రో కూడ తెలియని వారుంటారు. వారి దుర్భర జీవితాల గురించి ఆలోచించినప్పుడు ఎంతటివారికైనా హృదయం తరుక్కుపోతుంది. ఇటువంటివారికోసం ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యనందించాలి. తగిన వసతి కల్పించాలి.
- జి.వి. రత్నాకర్‌రావు, హన్మకొండ
సర్టిఫికెట్లు రద్దు చేయాలి
తిరునగరి, తిరుకోవెల, సాత్పడి, పరాంకుశం, శ్రీ పెరంబుదూరు, వకుళాభరణం వంశీయులు చాత్తాద శ్రీవైష్ణవులు ప్రభుత్వం గుర్తించి బిసిడి గ్రూపు (28 నెం)కు చెందిన వారు. వీరు యస్‌సిలు కారు. బిసి-ఎ గ్రూపునకు చెందినవారు. అన్‌టైయిన్డ్ డిఎస్సీ- 2002లో పై వంశీయులకు చెందినవారిలో కొందరు యస్.సి సర్ట్ఫికెట్లు మరికొందరు బిసి ఏ గ్రూపు సర్ట్ఫికెట్లను సమర్పించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చెలామణి అవుతున్నందున వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని వారి సర్ట్ఫికెట్లు రద్దుచేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, డిఇఓ గార్లను కోరుతున్నాము.
- సాత్పడి నర్సయ్య, శ్రీపెరంబుదూరు
హైదరాబాద్ అంటే ఇంతేనా?!
దాదాపుగా అన్ని పత్రికలు, టీ.వి ఛానెళ్ళు హైదరాబాద్ అంటే బిర్యాని, చార్మినార్ గాజులు, హలీమ్, ఇఫ్తార్ విందులు, చార్మినార్, మక్కామసీదు, ఇంకా ఉర్దూ, మసీదులు, చర్చిలు అనిపించేలాగా అవసరానికి మించి ప్రచారం ఇస్తున్నారు. తెలుగు సంస్కృతిని పట్టించుకోవటం లేదు.