ఉత్తరాయణం

కరెన్సీ కష్టాలు తీరవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులకు కునుకు పట్టకుండా పోయిందో లేదో గానీ, చిల్లర నోట్లకు కరువొచ్చి సామాన్య ప్రజలకు వణుకొస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వచ్చి రెండు వారాలు గడిచినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు, బ్యాంకులో ఉన్న తమ కొద్దిపాటి డబ్బును తీసుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద తోపులాటలు నిత్యకృత్యంగా మారాయి. చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడినా ఫలితం దక్కని దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశంలో టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ పొందాలంటే నేతల దయాదాక్షిణ్యాలు, సిఫార్సులు అవసరమయ్యేవి. అంతటా ‘లైసెన్స్ రాజ్’ ఉండేది. ఇపుడు మళ్లీ అవే రోజులు దాపురిస్తున్నాయి. ప్రజలు తమ డబ్బును తాము తీసుకోవాలంటే ఇపుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు, రోజువారీ ఖర్చులకు అవసరమైన నగదును పొందే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకువారు దయతలచి ఎంత విదిలిస్తే అంత తీసుకుని ఈసురోమని ఇంటిముఖం పట్టాల్సిందే.
క్యూలు, జిరాక్స్ కాపీలు, సిరాచుక్కలు, లాఠీ దెబ్బలు, తోపులాటలు ఇపుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమైపోయాయి. వ్యాపారాలు, ప్రయాణాలు, అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ దేశ ఆర్థికరంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది. నల్లధనాన్ని అంతం చేస్తామన్న మోదీ ప్రభుత్వ ప్రకటనలు అపహాస్యం అవుతున్నాయి. కాశ్మీర్‌లో హతమైన ఉగ్రవాదుల వద్ద రెండువేల రూపాయల నోట్లు బయటపడడం ఆందోళనకర పరిణామం. మరోవైపు అపుడే నకిలీ 2వేల రూపాయల నోట్లు చెలామణిలోకి వస్తున్నాయి. నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు చెప్పక తప్పదు. పెద్దనోట్లను రద్దు చేసే ముందు పర్యవసానాలను అంచనా వేయలేకపోవడం మహా తప్పిదం. నల్లధనంతో ఎలాంటి సంబంధం లేని సామాన్యులకు నరకం చూపడం సమంజసమా? క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం, ఆర్‌బిఐ ఇకనైనా చొరవ చూపాలి.