ఉత్తరాయణం

నిషేధం ఉత్తమాటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతగా ప్రగతి సాధించినప్పటికీ సమాజంలో ఇంకా అనేక మూఢాచారాలు కొనసాగుతున్నాయి. జంతుబలుల్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఏనాడో చట్టం చేసింది. ఈ చట్టంపై అధికారులు ఎలాంటి ప్రచారం చేయడం లేదు. జాతరలు, గ్రామదేవతల పండుగల సందర్భంగా మూగజీవాలను పెద్దఎత్తున బలి ఇస్తున్నారు. సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థలు, జీవకారుణ్య సంఘాల వారు జంతుబలుల నిషేధానికి ఉద్యమించాల్సి ఉంది. దేవతలకు జంతువులను బలి ఇస్తే అంతా మంచి జరుగుతుందని అనుకోవడం మూఢ విశ్వాసం. జీవహింస మహాపాపం అని చెబుతున్న మన సంస్కృతిని గుర్తించైనా జంతుబలులకు స్వస్తి పలకాలి.
- గూరుడు అశోక్, గోదూర్
మాతృభాషపై చిన్నచూపు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆంగ్లభాషకు అందలం ఎక్కిస్తున్నారు. మాతృభాష తెలుగు పట్ల వివక్ష చూపుతున్నారు. ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగాలకు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం అవసరమే. అంతమాత్రాన మాతృభాషను మరచిపోయేలా చేయడం తగదు. పిల్లలకు మాతృభాషలోని మాధుర్యం తెలిసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. విదేశాలకు వెళితే ఆంగ్లభాష అవసరం ఉన్నట్లే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే హిందీ కూడా అంతే అవసరం. మాతృభాషతో పాటు హిందీ కూడా ఎంతో అవసరం. 1వ తరగతి నుండే అన్ని పాఠశాలల్లో హిందీని కూడా ఓ సబ్జెక్టుగా బోధించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
వరంగల్ రూరల్‌లో కలపండి
హుజూరాబాద్ వాసులకు హన్మకొండతో దశాబ్దాల తరబడి విడదీయలేని బంధం ఉంది. ఏ చిన్న అనారోగ్యానికి గురైనా, ఏవైనా సరకులు కొనుక్కోవాలన్నా హుజూరాబాద్ ప్రాంత ప్రజలు హన్మకొండకే వెళ్తారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబద్ పట్టణం నిజానికి హన్మకొండకు అతిదగ్గరగా వుండి ప్రయాణానికి సులువుగా వుంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు ప్రజల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీయరాదు. హన్మకొండలో వుండాలన్నదే హుజూరాబాద్ వాసుల చిరకాల వాంఛ. ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో హుజూరాబాద్‌ను కలిపివేస్తే నష్టం ఏమీ ఉండదు.

- కె.వెంకటేశ్వర్లు, హుజూరాబాద్
మాదక ద్రవ్యాల జోరు
ధనార్జన కోసం తప్పుడు పనులు చేసేవారు అంతకంతకూ పెరిగిపోతున్నారు. గతంలో కొకైన్, బ్రౌన్ షుగర్, చరస్ వంటి మాదకద్రవ్యాల వినియోగం పరిమితంగా వుండేది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎంతో రహస్యంగా ఈ వ్యాపారం జరిగేది. వీటిని విక్రయించేవారు, వినియోగదారులు పోలీసులంటే హడిలెత్తిపోయేవారు. రానురానూ పోలీసులంటే భయం సన్నగిల్లడం, చట్టం నుంచి తప్పించుకోగలమనే నమ్మకం పెరగడంతో మాదక ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే పదివేల కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు అనధికార అంచనా. మాదకద్రవ్యాల విష వలయంలో బలైపోతున్నది యువతీ యువకులే. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఈ విషయంలో ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు!
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
చట్టాలను మార్చండి..
ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో, సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లతో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా ముస్లిం మతస్థుల్లో భర్త తన జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చేయడం సబబు కాదు. ఇలాంటి చర్యలతో ముస్లిం మహిళల ఆత్మాభిమానానికి, గౌరవానికి భంగం కలుగుతోంది. ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌లోని పెద్దలు, పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్య సమాజం, మత ఛాందస భావాలతో విడాకుల చట్టం భర్తలకే అనుకూలంగా ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తోపాటు అనేక ఇస్లాం దేశాల్లో లేని ‘ట్రిపుల్ తలాక్’ పద్ధతి మనదేశంలో మాత్రమే ఎందుకని ముస్లిం మహిళలు ఆక్రోశిస్తున్నారు. తలాక్‌ను రద్దు చేస్తే భారతదేశం పూర్తిగా హిందుస్థాన్ అవుతుందని మజ్లిస్ వంటి ముస్లిం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాల్య వివాహాలు, బహు భార్యత్వం లాంటి సామాజిక రుగ్మతలతోబాటు తలాక్ విధానం ముస్లిం మహిళల్లో అభద్రతని కల్గించడం బాధాకరం. ‘ఆకాశంలో సగం’ అని మహిళల గురించి గొప్పలు చెప్పడం కాదు, వారికి న్యాయం చేసేలా చట్టాలను సవరించాలి. - తాళ్ళూరి మణి, కాకినాడ