ఉత్తరాయణం

పెద్దనోటుతో అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో వెయ్యి రూపాయల నోటుకే చిల్లర లభించక వినియోగదారులు నానా ఇబ్బంది పడేవారు. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేశాక ఆర్‌బిఐ విడుదల చేసిన 2,000 రూపాయల నోటుతో ప్రజలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేతిలో 2వేల రూపాయల నోటున్నా ఏదీ కొనుక్కోలేని దుస్థితి దాపురించింది. చాలా ఎటిఎంలలో 2వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఈ నోటుతో చిల్లర సమస్య దారుణంగా మారింది. 2వేల రూపాయలతో నగదు దాచుకోవడం సులభం కనుక నల్లధనం మరింత పోగయ్యే ప్రమాదం ఉంది. పాతనోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లకుబేరులు బికారులవుతారా? నోట్ల మార్పిడి సమయంలోనే బడాబాబులు 500, 1,000 రూపాయల నోట్లను వదిలించుకున్నారు. ఎటొచ్చీ 2వేల నోటుతో పేద, మధ్య తరగతి వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వంద రూపాయల నోట్లన్నీ ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. కొత్త 500 రూపాయల నోటు ఇంకా జనం మధ్యకి రాలేదు. ఇపుడు 2వేల నోట్లను పట్టుకుని ప్రజలు ఏం చేయాలి?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
నకిలీలతో జాగ్రత్త..
ఆర్‌బిఐ కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోటు ఇంకా చాలామంది చూడకముందే, దాని పట్ల ఇంకా ప్రజల్లో అవగాహన రాకముందే నకిలీ నోట్లు చెలామణిలోకి రావడం విస్మయం కలిగిస్తోంది. కొందరు మోసగాళ్లు రెండువేల నోటుకు కలర్ జిరాక్సులు తీసి అమాయకులకు అంటగడుతున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు చోట్ల ఈ వంచకులు పోలీసులకు పట్టుబడ్డారు. గనుక రెండువేల రూపాయల నోటు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ నోటుపై గ్రామీణులకు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలి. అసలు నోటును ఎలా గుర్తించాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. అనుమానితుల గురించి తెలిస్తే ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కొట్టుకొంటారేమో!
ఇటీవల చట్టసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, వ్యక్తిగత దూషణలు, ఫలితంగా సమావేశాలను వాయిదా వేయడం సర్వసాధారణమైంది. పార్లమెంటులో గాని, అసెంబ్లీలోగాని ప్రజల కోసం చర్చించకుండా నేతలు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. మొక్కుబడి సమావేశాల వల్ల ప్రజాధనం ఖర్చవుతోంది తప్ప పాలనావ్యవస్థలో సమస్యలు తప్పడం లేదు. ముందుముందు చట్టసభల్లో ఏదో మిష మీద నేతలు కొట్టుకోవడం కూడా చూస్తామేమోనని అనిపిస్తోంది.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హనుమకొండ
సంస్కరణలు భేష్
దేశమంతటా ఒకే విధమైన టాక్స్ పద్ధతిని ప్రవేశపెట్టడంతోపాటు నల్లధనాన్ని నిర్మూలించేందుకు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వంటి మోదీ సంస్కరణలు అభినందనీయం. మరోవైపు దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ కుతంత్రాలను తిప్పికొట్టడంలో మోదీ దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు భావితరాలకు అందుతాయి. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి పురోగతిలో ఉంటుంది. రాబోయే బడ్జెట్ ఆశాజనకంగా ఉండవచ్చని సామాన్య మానవులు భావిస్తున్నారు.
- అయినం రఘురామారావు, ఖమ్మం