ఉత్తరాయణం

ప్రాణాలు తీస్తున్న సరదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తే చాలు తల్లిదండ్రుల్లో అలజడి పుడుతోంది. స్నేహితులతో సరదాగా సెలవురోజులు గడుపుదామని విద్యార్థులు చెరువులు, నదుల వద్దకు, బీచ్‌ల వద్దకు వెళుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఈత రాక మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెల్ఫీల మోజుతో కొందరు మృత్యువాత పడుతున్నారు. సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ లోపం కొంత కారణమవుతోంది. మరికొందరు యువకులు బైక్‌లపై అతివేగంతో దూసుకుపోతూ ప్రాణాలు కోల్పోతున్నారు. విహారయాత్రలకు వెళ్లే పిల్లలు అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు హెచ్చరిస్తుండాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం
రిజర్వేషన్ల రాజకీయాలు
ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కొన్ని పార్టీల నేతలు రిజర్వేషన్ల తాయిలాలు ప్రకటిస్తూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనం కోసం రిజర్వేషన్లు కల్పిస్తామన్న నేతల ప్రకటనలు వివిధ సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే బిసి జాబితాలో ఉన్నవారు వ్యతిరేకిస్తున్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు తాజాగా వరాలు ప్రకటించారు. ఇలా రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులను ప్రోత్సహించినట్టే అవుతుంది. దీనివల్ల నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుంది. మతం మార్చుకునే వారు ఇప్పటికే అక్రమ పద్ధతుల్లో రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇస్తే మరోవైపు హిందూ మతం బలహీనపడే ప్రమాదం ఉంది. నిరుపేద దళితులు అభివృద్ధి చెందాలంటే మత మార్పిడులను గట్టిగా నిరోధించాలి. బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో రిజర్వేషన్లు పొందతున్న వారిని కఠినంగా శిక్షించాలి.
-వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం
కరెన్సీ కష్టాలు కొన్నాళ్లే..
పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల భవిష్యత్‌లో దేశానికి కచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు విపక్ష నేతలు రాజకీయ కోణంలో విభేదిస్తూ వితండ వాదం చేస్తున్నారు. ప్రస్తుతం కరెన్సీ కొరత వల్ల పేద, మధ్య తరగతి వారు కష్టాలు పడుతున్న మాట నిజమే. అయినా దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కొద్దిరోజులు ఇబ్బంది పడినా నష్టం లేదు. దేశరక్షణ కోసం సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయక రాత్రింబవళ్లు కష్టపడుతుండగా, నగదు కోసం కొన్ని గంటల సేపు ‘క్యూ’లో నిలబడడం పెద్ద సమస్య కాదు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రధాని చేపట్టిన సంస్కరణలకు అందరూ మద్దతు పలకాలి. దేశహితం ముఖ్యమని భావించి కరెన్సీ కష్టాలను సహనంతో అధిగమించాలి.
- కొత్తపల్లి పోషన్న, ములుగు
ఇది మోదీ ఘనత
పెద్దనోట్లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని ఇపుడు భారతీయులే కాదు, అనేక దేశాల్లోని వారు ప్రశంసిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకుల్లో డిపాజిట్ కావడాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానుల్లో మోదీ అగ్రస్థానంలో నిలవడం జాతికే గర్వకారణం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మోదీ మరిన్ని సంస్కరణలు చేపట్టాలి. భావితరాలను దృష్టిలో ఉంచుకుని జాతిజనులంతా మోదీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్