ఉత్తరాయణం

ఇది చట్ట ధిక్కరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య దేశాల్లో మత విశ్వాసాల కన్నా వ్యక్తి స్వేచ్ఛ, హక్కులు మిన్న. ఏళ్ల తరబడి కొనసాగే దాంపత్య బంధాన్ని ‘తలాక్’ అనే మాటతో రద్దు చేసి పొమ్మనడం ముస్లిం స్ర్తిల హక్కుల్ని హరించడమే. కొన్ని ముస్లిం దేశాల్లో ఇప్పటికే ‘తలాక్’ని రద్దుచేశారు. ‘మా దేశంలో ఉండాలంటే మా చట్టాల్ని పాటించాల్సిందే’- అని ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు నియమం పెడతాయి. అందుకు అంగీకరించిన మీదటే ముస్లింలు అక్కడ వుంటున్నారు. మన దేశంలో మాత్రం కొందరు మత విశ్వాసాలు ముఖ్యం అంటున్నారు. చట్టాలకు తాము అతీతం అనుకుంటున్నారు. మత విశ్వాసాలంటూ చట్టాల్ని ధిక్కరిస్తున్నారు.
- మరుదకాశి, కరప
భక్తులకు నిలువుదోపిడీ
తెలుగు రాష్ట్రాలలోని అనేక దేవాలయాల వద్ద దోపిడీకి అంతే లేకుండా పోతోంది. భక్తుల నమ్మకాలను కొంతమంది మోసగాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక ఆలయాల వద్ద ఆయా దేవతలకు సంబంధించిన పూజా సామగ్రిని అవసరం ఉన్నా, లేకున్నా ఎక్కువ ధరతో భక్తులకు బలవంతంగా అమ్ముతున్నారు. ఆ పూజాసామగ్రితో గుడిలోకి వెళితే కలిగే ఫలితాలను చెబుతూ అధిక ధరలకు అమ్ముతున్నారు. వీటిని విక్రయించేందుకు బాల కార్మికులను వినియోగిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని ఈ మోసగాళ్ల భరితం పట్టాలి. ఆలయాల బయట పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న దుకాణాలను నియంత్రించాలి. తక్కువ ధరకే అవసరమైన పూజాసామగ్రిని అమ్మేలా చూడాలి. బాల కార్మికులు లేకుండా చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కొత్త రైళ్లు ఎప్పుడు?
కాకినాడ పోర్టు- పిఠాపురం రైల్వే మెయిన్ లైన్ అనుసంధానం ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. విజయవాడ నుండి గాని విశాఖ నుండి గాని ఉదయం పూట కాకినాడ పోర్టుకు చేరుకునేందుకు పాసింజరు రైళ్ళు లేనందున సామర్లకోటలో కాకినాడ వెళ్లే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుమార్గం ద్వారా ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కాకినాడ పోర్టు వల్ల అధిక ఆదాయం వస్తున్నప్పటికీ ఈ ప్రాంత ప్రయాణికులకు రైల్వేశాఖ సౌకర్యాలు పెంచడం లేదు. కాకినాడ పోర్టు- బిలాస్‌పూర్- హౌరా వీక్లీ రైళ్లు వేయాలని చాలాకాలంగా ప్రయాణికులు కోరుతున్నారు.
- జె.సుధాకరరావు, కాకినాడ
డిటెన్షన్ విధానం సరికాదు
విద్యాసంస్థల్లో 5 నుంచి 8వ తరగతి వరకు డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ చర్యలు తీసుకోవడం, దానికి కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపడం తొందరపాటు చర్య అని చెప్పక తప్పదు. నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009) సెక్షన్ 16ను ఇందుకోసం మార్పుచేయడం సహేతుకంగా లేదు. డిటెన్షన్ విధానంతో మధ్యలో బడిమానేసే వారి (డ్రాప్ అవుట్స్) సంఖ్య భారీగా పెరుగుతుంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. విద్యార్థులలో భయాందోళనలు చెలరేగడం ఖాయం. ఇప్పటికే సర్కారు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మూతపడుతున్నాయి. ప్రముఖ విద్యారంగ నిపుణులు ఈ విధానంపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి నాన్ డిటెన్షన్ విధానాన్ని కొనసాగించడం శ్రేయస్కరం.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు