ఉత్తరాయణం

ట్రంప్‌ను నిందించలేం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన దేశంలోని వారికి ఉద్యోగాలిస్తానని అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను భారతీయులు నిందించడం సరికాదు. అమెరికాలో మన యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేం. ఆంధ్రప్రాంతం వారు తమ ఉద్యోగాలను, అవకాశాలను లాక్కుంటున్నారన్న ఉద్యమంతో తెలంగాణ విడిపోయింది. అంతకుముందే పెద్ద మనుషుల ఒప్పందం పేరిట తెలుగువారిని జోన్ల పేరిట విడదీశారు. చదువులు, ఉద్యోగాలు, పదోన్నతులు జోన్లవారీగానే సాగుతున్నాయి. అమెరికా వారు ఇప్పుడు చేస్తున్నది ఇదే. విదేశీయులకు కోత విధించి స్వదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోంది. ‘డాలర్ల కల’ను సాకారం చేసుకునేందుకు మాతృభూమిని నిర్లక్ష్యం చేస్తూ అమెరికాకు వలస పోతున్న వారు కూడా ఉన్నారు. స్వదేశీయులకు ఉపాధి కల్పిస్తానంటున్న ట్రంప్‌ను నిందించే అర్హత మనకు ఉందా?
- పి.శుభ, కాకినాడ
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ఏపి ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనుల్లో కొన్నయినా పూర్తవుతాయా? అన్న సందేహం కలుగుతోంది. వెలగపూడి వద్ద తాత్కాలిక రాజధాని అని కొన్ని భవనాలు నిర్మించారు. ఇంకా అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులకు క్వార్టర్సు వంటివి ఎప్పుడు నిర్మిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎన్ని నిర్మాణాలు పూర్తవుతాయో అర్థం కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల కాలవ్యవధి మాత్రమే ఉంది. అమరావతిని నిర్మించేందుకు ఎన్నాళ్లు పడుతుందో? లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయో? ఎవరికీ తెలియదు. 2019 ఎన్నికల్లో తనను గెలిపించి మరో అయిదేళ్లు అధికారం అప్పగిస్తే పనులన్నీ పూర్తవుతాయని చంద్రబాబు హామీ ఇస్తారేమో? ఎన్నికలకు ముందే కొన్ని పనులైనా పూర్తి చేసేందుకు తగినన్ని నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. విభజన సమయంలో హామీల మేరకు రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించాలి.
- కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్
వేలిముద్రలతో వెతలు
రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార, ఇతర నిత్యావసర సరకులు పొందే సమయంలో వినియోగదారుల ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డును అనుసంధానం చేస్తూ వేలిముద్రలు తీసుకుంటున్నారు. ‘ఈ-పోస్’ యంత్రాల ద్వారా వేలిముద్రలు సరిగా ప్రింట్ కావడం లేదు. గంటల తరబడి వేచి ఉండలేక వృద