ఉత్తరాయణం

అస్తవ్యస్త మద్యం విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో ఇటీవల సంభవించిన కల్తీ మద్యం మరణాలు రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలకు తార్కాణం. రెక్కాడితేకాని డొక్కాడని అమాయకులైన ఐదుగురు రైతుకూలీలు మృత్యువాత పడగా ఇరవైమంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిపాలయ్యారు. ఇటీవల అనంతపురంలో కలీ తమద్యం మరణాలు సంభవించడం ప్రభుత్వం వైఫల్యా నికి నిదర్శనం. ముఖ్యమంత్రి క్యాంపు, ఎక్సైజ్ శాఖ మంత్రి స్వంత జిల్లాలో కల్తీమద్యం ఏరులై పారుతుం డగా, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో ఆ భగవంతుడికే ఎరుక. అబ్కారీ శాఖను ప్రధాన ఆదాయవనరుగా భావిస్తూ, ప్రతీ ఏడాది ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాలు పెంచుతుండడం వల్లనే ఈ దుస్థితి దాపురిం చింది. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం గాలికొదిలేసి, ప్రభుత్వం నడిపేందుకు మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయం వినియోగించడం సిగ్గుచేటు. పైగా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచేందుకు నగరం, గ్రామం, గుడి, బడి అన్న వ్యత్యాసం లేకుండా అడిగినవారికి కాదనకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఐస్‌క్రీమ్ షాపుల్లా మద్యం దుకాణాలకు అనుమతులివ్వడం సమంజసం కాదు. ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల్ని తాగడానికి ప్రోత్సహించడమా? చెక్‌పోస్టులో అవకతవకలను ఆధారం చేసుకొని లక్షల లీటర్ల కల్తీమద్యం పొరుగు రాష్ట్రాల నుండి లక్షల లీటర్లలో వస్తోంది. దీనికి సుంకం కట్టకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రజలకు ఎన్టీఆర్ వైద్యసేవ అందుబాటులో ఉంటుందని వైద్యశాఖ మంత్రి ప్రకటించారు. అంటే ఎంతైనా తాగండి. మీ సంగతి మేం చూసుకుంటాం, అన్నది ప్రభుత్వ విధానమా? మద్యం వల్ల కుటుంబాలు చితికిపోవడంతో పాటు శాంతి భ ద్రతల సమస్య కూడా ఉత్పన్నమవుతోంది.
-సాయ మనస్విత, విజయవాడ
లంచం
1) లంచమివ్వుటన్న- వంచనగాబట్టి
నేర శాక రాగ? మారిపోయి-
మద్యపానముంచి- మర్యాదగావించి
కాన్కలుంచి పంపు కనికరాన!
2) నీతి మాటలన్ని- నియమాలుగా మలచి
జాతి జాగృతులను జరుపునట్లు
తెలిపి- కలుపుకొనుచు తెలివిగా మలచిన
పలుకుబడులు బంచు మలుపులెన్నొ
3) చుట్టమిచ్చు చీటి చట్టాలనే మార్చు
కట్టుబాట్లు నేడు కలపలాగ
దైవసన్నిధాన భావనలను గొట్టు
నేటి పెద్దవారు పోటి వింత!
4) కలల యుగముగాదు కలియుగంబిదియని
మోసపరచువారి మోజు బెరుగ
కళలచేత జేయుకల్పన లెన్నియో
నేర్వకున్న మనిషి నేర్పుజూపు
- శ్రీ కె.ఈశ్వరప్ప, ఆలూరు
వృద్ధ నేతల వ్యర్థ ప్రేలాపనలు
బీహార్‌లో ఓటమి తర్వాత బిజెపిలో ఆ వృద్ధ నాయకులతో కూడిన ఒక వర్గం పార్టీ నాయకత్వంపై వ్యర్థ ప్రేలాపనలు, అసమ్మతి రాగం అందుకున్నారు. పార్టీ ఓటమికి మోదీ- అమిత్‌షాలే బాధ్యత తీసుకోవాలని బహిరంగ ప్రకటనలు చేశారు. గతంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. విజయదుంధుబి మోగించినప్పటి ఎవ్వరూ మోదీ-షా ధ్వయాన్ని ప్రశంసించనప్పుడు, రెండు రాష్ట్రాలలో ఓటమి వలన వారిపై విమర్శల పర్వం ప్రారంభించడం ఏం సమంజసం? ఈ వృద్ధ నాయకులు 2004, 2009లలో పార్టీని పరాజయం బాట పట్టించినప్పుడు పార్టీ వీరిని బాధ్యులను చెయ్యలేదన్నది గుర్తుంచుకోవాలి. వీరి అసమ్మతి ప్రేలాపనల వెనుక అధికార వాంఛ తప్ప పార్టీపై ప్రేమ ఏమాత్రం లేదన్నది నిర్వివాదాంశం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఏటిఎం ఏర్పాటు చేయాలి
డోన్ రైల్వేస్టేషన్‌లో ఏటిఎమ్ ఏర్పాటుచేయాలి. ఈ స్టేషన్‌లో ఏటిఎమ్ ఏర్పాటుచేయడంవల్ల ఈ మార్గం గుండా ప్రయాణం చేసే వారికి, ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డోన్ రైల్వే జంక్షన్ కావడంవల్ల ఇక్కడ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్ ద్వారా రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు, ఏటిఎమ్ వుండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా బ్యాంక్‌వారు ఇక్కడ ఏటిఎమ్ ఏర్పాటుచేస్తే ప్రయాణికులతో పాటు, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వేశాఖ అధికారులు కూడా ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
దివాలాకోరు రాజకీయం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకే) పాకిస్థాన్‌లో అంతర్భాగమని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌అబ్దుల్లా ప్రకటన ఆయన అపరిపక్వత, రాజకీయ అవకాశవాద, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం. పేరులోనే అది పాక్ ఆక్రమిత ప్రాంతం అని వుంది. కాశ్మీర్ భారత్‌కు, పిఓకే పాకిస్థాన్‌కు అప్పగించేస్తే ఇరు దేశాల మధ్య సమస్యలు శాశ్వతంగా పరిష్కారవౌతాయని ప్రభుత్వానికి చేసిన సూచన చవకబారు తనంగా వుంది. భారత్‌లో అనిశ్చితి కలుగుజేసేందుకు మందలకొద్దీ టెర్రరిస్టులను దేశంలోనికి రహస్యంగా పంపిస్తున్న ప్రహసనాన్ని ఆపివేయాలని పాక్‌కు ఎందుకు సూచించలేక పోయారు? చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసి, రాజకీయ లబ్దికోసం చవకబారు నాటకాలు వేసే ఇటువంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి