ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చైనా ఆటకట్టించలేమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న చైనా దూ కుడును అరికట్టలేమా? ఒకవైపు పాకిస్తాన్‌ను చైనా మన పైకి ఉసిగొల్పుతోంది. ఆక్రమిత కాశ్మీర్ గుండా పాకిస్తాన్ తీరంలోని ఓడరేవు వరకు భారీ రోడ్డును నిర్మిస్తూ మన దేశ సార్వభౌమాధికారాన్ని చైనా ప్రశ్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తమ పేర్లు ప్రకటించటం ద్వారా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను అదుపులో పెట్టేందుకు మనం ఆర్థికంగా, సైనికశక్తి పరంగా ఎంతో ఎదగవలసి ఉన్నది. చైనాను నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికపై ఇప్పటి నుండే ఏర్పాట్లు చేయకపోతే ముందు ముందు మనకు తీవ్ర పరిణామాలు ఎదురు కావచ్చు. చైనా విషయంలో మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పులనే చేసి, 1962 నాటి పరిస్థితిని పునరావృత్తం అయ్యేలా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తే దేశ ప్రజలు, చరిత్ర క్షమించదు.
ఉపగ్రహ దౌత్యంతో పాకిస్తాన్ మినహా మిగతా సార్క్ దేశాల మన్ననలను పొందగలిగినంత మాత్రాన దక్షిణాసియాలో భారత్ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటం సాధ్యం కాదు. చైనా, పాకిస్తాన్‌లను కట్టడి చేయనంత కాలం దక్షిణాసియాలో భారత్ మాట చెల్లుబాటు కాదు. బంగ్లాదేశ్, భూటాన్ మన మాట విన్నా శ్రీలంక, మాల్దీవులు మనతో మంచిగా ఉంటూనే చైనా, పాకిస్తాన్‌లతో అవసరం కంటే ఎక్కువ స్నేహం చేస్తున్నాయి. అఫ్ఘానిస్తాన్ పలు సందర్భాల్లో మనకు మద్దతు ఇచ్చినా, ఆ దేశ పాలకులు చివరకు ఇస్లామిక్ రాజకీయ వ్యవస్థకు చేరువవుతారు. ఈ నేపథ్యంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు మొదట పాకిస్తాన్, చైనాలను నిలువరించే స్థాయికి ఎదగాల్సి ఉంది. దీని కోసం ఆర్థికంగా, సైనికంగా ఎంతో పటిష్టం కావలసిన అవసరం ఉన్నది. పాకిస్తాన్‌ను నిలువరించే స్థాయిలో ఉన్నా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించటంలో భారత్ విజయం సాధించలేకపోతోంది. కాశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో నెలకొన్న ఇస్లామిక్ ఉగ్రవాద సమస్య కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. మనల్ని సైనికపరంగా ఎదుర్కొనలేని పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అత్యంత పటిష్టమైన ఆయుధంగా మార్చుకోవటంలో విజయం సాధించింది.
ఉగ్రవాదుల సహాయంతో పాకిస్తాన్ తనకు అవసరమున్నప్పుడల్లా కాశ్మీర్‌లో అశాంతిని రెచ్చగొడుతోంది. మరోవైపు చైనా తన ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాల కోసం మనల్ని దెబ్బతీస్తోంది. పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా, ఇస్లామిక్ ఉగ్రవాదానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ మన దేశాన్ని పలు స్థాయిల్లో దెబ్బ తీస్తున్న చైనా పాలకులు ఇప్పుడు మనల్ని నేరుగా దెబ్బతీసేందుకు సిద్ధమయ్యారు. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేందుకు మన ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకు మండిపడుతున్న చైనా పాలకులు అదను కోసం ఎదురుచూస్తున్నారు. అతిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొన వలసి వస్తుందంటూ చైనా పాలకులు హెచ్చరికలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తమ పేర్లు ప్రకటించుకున్నారు. అరుణాచల్‌ను భారత్ ఆక్రమించిందంటూ చైనా పాలకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా దిల్లీలో జరిగే భారత్,చైనా,రష్యా విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఆ దేశం బహిష్కరించింది. దలైలామాను అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చినందుకు నిరసనగా తాము మూడు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చైనా బాహాటంగా ప్రకటించటం గమనార్హం. భారత్‌లో విధ్వంసం సృష్టిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల అధినాయకులను ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఐక్యరాజ్య సమితి యత్నించగా చైనా పలుమార్లు అడ్డుపడటం తెలిసిందే. ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్‌లోని గదర్ పోర్టు వరకు నిర్మిస్తున్న రోడ్డు కోసం చైనా ఇలా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటంతోపాటు భారత్‌ను అణచివేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. చైనా ఉత్పత్తులను సులభంగా ఐరోపా దేశాలకు చేరవేసేందుకు ఈ రోడ్డు కోసం పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దురాగతాలన్నింటినీ చైనా సమర్థిస్తోంది. ఇదే సందర్భంగా అరుణాచల్‌లో దలైలామా పర్యటన మరింత అగ్గిని రాజేసింది.
మన తొలి ప్రధాని నెహ్రూతో ‘హిందీ చీనీ భారుూ భారుూ’ అంటూనే 1062లో మన దేశంపై దాడి చేసి ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని కబళించిన చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు సిక్కింను స్వాధీనం చేసుకునేందుకు మనతో యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోరాదు. చైనాను ఎటువంటి పరిస్థితిలో కూడా మనం విశ్వసించలేమని గత అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. ‘హిందీ చీనీ భారుూ భారుూ’ అంటూనే మనను మోసం చేసిన చైనాకు బుద్ది చెప్పవలసిన బాధ్యత మన పాలకులపై ఉన్నది. ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలి. ఈ లక్ష్యసాధన కోసం మన పాలకులు ఆహర్నిశలూ కృషి చేయవలసి ఉంటుంది. పాకిస్తాన్ లాంటి బాధ్యతారహిత ‘రోగ్’ దేశాన్ని పక్కన పెట్టుకుని చైనాను ఎదుర్కొనటం మామూలు విషయం కాదు. చైనాను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా, సైనికంగా ఎంతో బలపడవలసి ఉంటుంది. చైనా ప్రస్తుత సైనికశక్తితో పోలిస్తే మన సైనికశక్తి ఎంత మాత్రం సరిపోదు. ఈ కారణంగానే చైనా సైన్యం తమ ఇష్టానుసారం మన భూ భాగంలోకి చొచ్చుకువచ్చి రోజుల తరబడి తిష్ట వేస్తోంది. ‘ఇది మా భూమి.. మీరిక్కడికి రావద్దం’టూ మన సైనికులు, ప్రజలు పదేపదే హెచ్చరిస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తుంటారు. చైనా సైనికులు పలు సందర్భాల్లో మన సైనికులు ఏర్పాటు చేసుకునే భద్రతా ఏర్పాట్లను తొలగించిపోతుంటారు. వారు మన సైనికుల పట్ల చులకన భావంతో వ్యవహించటం పరిపాటిగా మారింది. మనం సైనికపరంగా ప్రతిస్పందించలేమని చైనా పాలకుల ధీమా. చైనా సైనికులు భారతీయుల పట్ల దురుసుగా, రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారు. ఇంత జరుగుతున్నా మన పాలకులు పెద్దగా స్పందించడం లేదు. చైనాను నిలువరించాలంటే ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. మన సైనికశక్తి గణనీయంగా ఎదగాలి. ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అన్న స్థాయికి మన సైనికశక్తి ఎదగనంత కాలం చైనా మన పట్ల చులకనగా వ్యవహరించటం మానదు. సొంత జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాలను తయారు చేసుకుంటున్న చైనాను ఎదుర్కోవాలంటే మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి.
మూడు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాము హాజరు కావడం లేదని చైనా విదేశాంగ శాఖ అత్యంత అవమానకరమైన పద్ధతిలో చేసిన ప్రకటనతోనైనా మన పాలకులకు కనువిప్పు కావాలి. చైనా చేసిన ఈ ప్రకటనలో మనపట్ల ఎంతో చులనకన భావం ప్రదర్శించించింది. చైనాకు అనుకూలమైన సమయంలోనే విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని మన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చినా చైనా పాలకులు మాత్రం ససేమిరా అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేందుకు దలైలామాను అనుమతించడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. రాబోయే రోజుల్లో తమ వైఖరి మరింత కఠినంగా ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. *