ఉత్తరాయణం

విలువలకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రమైన గవర్నర్ వ్యవస్థ, రాజ్‌భవన్‌లు కుట్రలు, కుతంత్రాలు వేదికగా మారడం ఈ మధ్య తగ్గిందనుకు నేంతలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిణా మాలు తిరిగి గవర్నర్ వ్యవస్థపై చర్చకు దారి తీశాయ. ఆ రాష్ట్ర శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటె రెండు నెలల ముందుగానే సభ ప్రారంభమై స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ జరపాలని ఆదేశాలివ్వడం రాజ్యాంగ విరుద్ధంగా విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం ఒక హోటల్‌లో విపక్షాలు, రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పీకర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడం, మరొకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొ నడంతో పాటు ప్రస్తుత సిఎంను రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నవ్వులపాలు చేసేదిగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అత్యంత సమస్యాత్మక రాష్ట్రం. ఆ భూభాగాన్ని ఆక్రమిం చాలని చైనా విశ్వ ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాజకీయ సంక్షోభం, అస్థిరతలు తలెత్తడం దేశ భద్రతకు క్షేమం కాదు. గవర్నర్ రాజ్యాంగానికి అతీతంగా వ్యవ హరించడం మంచిది కాదు. రాజ్యాంగ సంస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయనడానికి అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన దుమారమే ప్రత్యక్ష ఉదాహరణ.
- సి. సాయమనస్విత, విజయవాడ.
చెప్పడానికేనా నీతులు?
తెలుగు సినిమాలన్నా... తెలుగు టి.వి. ఛానల్స్ అన్నా సరే చాలామందికి ఎప్పుడో అసహ్యం వేసింది. ఇది ప్రత్యేకంగా మనం చెప్పనక్కరలేదు. సర్కస్‌లో కోతుల్లా... జం తువుల్లా... పసి పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం తో... క్యాబరే చేస్తుంటే ఇది తప్పు అని చెప్పేవారే లేరు...! సమాజంకోసం గొప్పగా సంపాదకీయాలు... సూక్తిముక్తావళి బోధించే మన ఛానల్స్ వాస్తవానికి చేస్తుంది ఏమి టి...? నీతులు ఎదుటివారికి చెప్పడానికేనా?
- కె. సతీష్‌కుమార్, శ్రీకాకుళం
ఆడపిల్లకు చేయూతనిద్దాం
విచ్చుకొనే మొగ్గను తుంచకండి! పువ్వుగా ఎదగనివ్వండి. వికసించిన పుష్పం అందాన్ని మకరందాన్ని సున్నితంగా మనసారా ఆస్వాదించాలి. అప్పుడే ఆత్మసంతృప్తి. మొగ్గలాంటి ఆడపిల్లను పూవులా ఎదిగేవిధంగా చేయూతనిద్దాం. బాల్య వివాహాలు చెయ్యవద్దు. విద్యతో పరిమళించి వికసించాలి. ఆడపడుచు జీవితాన్ని కాపాడి రక్షణ కల్పించడం మానవ ధర్మం. భక్షించటం రాక్షస కృత్యం. మనం మానవులం.. రాక్షసులం కాము. అఘాయిత్యాలు, అత్యాచారాలు, అకృత్యాలు మన ఆడవారిపై జరపకండి. పరాయి ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయకండి. మన పిల్లలపై ఇలాంటివి జరిగి ఎంత విలవిలలాడిపోతాం! వివేకంతో సహనం పాటిద్దాం. మన సంప్రదాయాలు కాపాడండి! ప్రపంచ దేశాలకు మనం చులకన కాకూడదు.
- పొట్టి లక్ష్మీసుజాత, అద్దంకి
ఆదరణే మిన్న
ఇటీవల రైతులు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యల చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి, సామాన్యుడికి కూడ బాధ కల్గించే విషయం. దయవుంచి కుటుంబ వ్యక్తులు మిత్రులు అతనికి ధైర్యాన్ని జీవించటం పట్ల ప్రేమను కల్గించాలి. అంతేకాని మరణం పరిష్కారం కాదు. నాకు తెలిసిన ఈ విషయం మీముందు వుంచుతాను. చదివి బాగా అర్థం చేసుకోగలరు. కేరళలో ఓ పేరుబడిన రచయిత అంటే పల్లెటూరి రైతుకు అభిమానం. ఒకసారి ఆ రచయితకు జబ్బుచేసినప్పుడు ఆ రైతు ఆసుపత్రికి వెళ్లి పలుకరించాడు. అయ్యా మీరు నా అభిమాన రచయిత. మీరు త్వరగా కోలుకోవాలి. అవసరమైతే ఇక్క డే వుండి, సేవలు చేస్తాను అంటాడు. ఆ రచయిత కన్నీరు నింపుకొని రైతును అభినందిస్తాడు.
- ఎం.కె.మూర్తి, విజయవాడ
విచిత్ర జీవులు
వామపక్షీయులు విచిత్ర జీవులు. రాజ్యాంగం మీద నమ్మకం లేదంటూ ఎన్నికల్లో పాల్గొంటారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే సమయానుకూలంగా రాజ్యాంగాన్ని అనుసరించమని ఉపదేశిస్తారు! వ్యక్తిస్వేచ్ఛకూ పరిధి ఉంటుంది. ఇతరులు బాధపడేట్టు మాట్లాడరాదు, ప్రవర్తించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తే ఆ ఆదేశాన్ని ధిక్కరించి బీఫ్ ఫెస్టివల్ అంటూ రగడ చేసి మెజారిటీ వర్గాల్ని బాధిస్తారు. పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని హర్యానా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా తీర్పుచెప్తే రాజ్యాంగంలో జోక్యం చేసుకుంటున్నాయని కోర్టుల్ని నిందిస్తారు. పేదవాడు ఎన్నికల్లో నిలబడలేడని వారి అభ్యంతరం. కనీస విద్యార్హత నిర్బంధం లేక పోయినా పేదవాడు ఎన్నికల్లో గెలవడం ఎప్పుడైనా ఉందా వామపక్ష నేతలూ?
- జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
పోస్టుబాక్స్ పెట్టండి
పోస్ట్ఫాసుతోపాటు గ్రామాల్లో రెండుమూడుచోట్ల లెటర్ బాక్సులు తపాలాశాఖవారు వుంచుతున్నారు. అయితే మల్కాపురం పోస్ట్ఫాసువారు ఇతరచోట్ల లెటర్ బాక్సులు వుంచడం లేదు. దానివలన వినియోగదారులు ఇబ్బందిపడ్తున్నారు. క్రితంలో మల్కాపురం మార్కెట్ దగ్గర ఒక లెటర్ బాక్సు వుండేది. ఏ కారణంచేతనో దానిని తొలగించారు. మార్కెట్‌వద్ద లెటర్స్ బాక్సును వుంచవలసిందిగా పోస్టుమాస్టార్ని కోరుతున్నాం. అక్కడ ఏర్పాటు చేస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది.
- జవ్వాది వెంకటరమణ, విశాఖపట్నం