తూర్పుగోదావరి

బ్యాంకుపై నిందలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కలిగిన రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుపై వ్యక్తిగత దురుద్ధేశంతో నిందలు వేయడం తగదని రాజమహేంద్రవరం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకరరావు అన్నారు. మంగళవారం తిలక్ రోడ్డులోని బ్రాంచి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్ధేశంతో తనపై ఆరోపణలు చేస్తూ బ్యాంకు ప్రతిష్ఠకు భంగం చేయకూడదన్నారు. బ్యాంకులో ఏడాది కాలంలో రూ.8.42 కోట్ల నికర లాభం సాధించామని బ్యాంకు ప్రగతి వివరించారు. తాను తప్పులు చేసినట్టు రుజువుచేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని, లేనిపోని నిందలు వేసి బ్యాంకు పరువుకు భంగకరం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తాను పార్టీ మారి టిడిపిలోకి వెళ్ళడం తన రాజకీయ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని, బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరితో వున్న సుదీర్ఘ స్నేహం మేరకు పార్టీలోకి వెళ్లానని, అదే విధంగా అన్ని పార్టీలకు చెందిన నేతలతోనూ విస్తృతమైన సంబంధాలు ఉన్నాయని, రాజకీయ కుటుంబానికి చెందిన తాను నీతి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తినన్నారు. బ్యాంకును లాభాల బాట పట్టించడమే పరమావధిగా పాలకవర్గమంతా కృషి చేస్తుందన్నారు. బ్యాంకు లాభాల బాట పట్టేందుకు తమ పాలకవర్గం తీసుకున్న ప్రక్షాళన, సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. బ్యాంకును డిప్యూటీ కో-ఆపరేటివ్ రిజిస్టార్ పరిధిలోనే నిర్వహిస్తామన్నారు. బ్యాంకులో లొసుగులు వున్నాయని, లోపాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారని, అవేమిటో రుజువు చేయలని సవాల్ చేశారు. తన పదవి ద్వారా బ్యాంకు ఇచ్చే జీతంతో పాటు నెలకు లక్షలాది రూపాయల మేరకు వెచ్చించి ఎంతో మంది విద్యార్ధులను చదివించడం జరుగుతోందని, అదే విధంగా తన పాలకవర్గ సభ్యులు కూడా తమకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక ఉన్నత వ్యక్తిత్వంతో నడుచుకుంటూ నలుగురికీ ఆదర్శంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు అయ్యల గోపి, యెనుముల రంగబాబు, రమణ, సూరంపూడి శ్రీహరి, ముళ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.