తూర్పుగోదావరి

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: శాసన మండలి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వివిధ మాధ్యమాల ద్వారా జరిపే ప్రచారం నైతికత, కంటెంట్, వ్యయం పరిశీలన, ముందస్తు స్క్రీనింగ్ అంశాలపై జిల్లా స్థాయి మీడియా సర్ట్ఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ నిశిత పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా స్థాయి మీడియా సర్ట్ఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల, అవుట్‌డోర్ పబ్లిసిటీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ద్వారా జరిపే ప్రచారంతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా, బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపే ప్రచార సందేశాలపై కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. వీటిలో పెయిడ్ న్యూస్‌గా కమిటీ నిర్ధారించిన వార్తలు, సందేశాలకు రేట్ కమిటీ నిర్దేశించిన మొత్తాలను వారి వ్యయ అకౌంట్లకు ఖర్చు చూపాలని సూచించారు. అదే విధంగా అభ్యర్థులు తమ ప్రచారంలో నైతికత అతిక్రమించి ప్రత్యర్థులపై దూషణలు, నిందారోపణలకు పాల్పడితే సదరు అంశాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని ఆదేశించారు. అభ్యర్థులు తమ ప్రచారానికి వివిధ మాధ్యమాలకు జారీచేసే ప్రకటనలను తప్పనిసరిగా కమిటీ స్క్రీనింగ్ చేసి, అనుపతి పత్రం పొందాల్సి ఉంటుందని కలెక్టర్ మిశ్రా తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎంవీ గోవిందరాజులు, కమిటీ సభ్యులు షఫీ మహమ్మద్, ఆర్డీవో రాజకుమారి, కేఎన్ మురళీశంకర్, వీసీ వెంకటపతిరాజు, సమాచార శాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, సెక్షన్ అధికారి విశ్వనాధశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు దాఖలు కాని నామినేషన్లు
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: పట్ట్భద్రుల నియోజకవర్గానికి సోమవారం అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్లు స్వీకరించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అనంతరం కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే మొదటి రోజున అభ్యర్థులెవరూ నామినేషన్లను దాఖలు చేయడానికి ముందుకు రాలేదు.