తూర్పుగోదావరి

సర్వశిక్షా అభియాన్ సీజనల్ హాస్టళ్లపై ‘విజిలెన్స్’ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: సర్వశిక్షా అభియాన్ నిధులతో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న జిల్లాలోని పలు సీజనల్ హాస్టళ్లపై విజిలెన్స్ అధికారులు సోమవారం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఎస్పీ పి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు జిల్లాలోని సర్వశిక్షా అభియాన్ నిధులతో స్వచ్ఛంధ సంస్థలు (ఎన్జీవోలు) నిర్వహిస్తున్న సీజనల్ హాస్టళ్ళను తనిఖీ చేయడంతో పలు లోపాలు బయట పడ్డాయి. కె గంగవరం మండలంలోని కోటిపల్లి గ్రామంలో సత్యదుర్గ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను తనిఖీ చేసిన అధికారులు అక్కడ సిబ్బంది తనిఖీ సమయంలో అందుబాటులో లేకపోవడం, ఎస్‌ఎస్‌వై నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని గుర్తించారు. అక్కడ 50 మంది విద్యార్థులకు ఒకే ఒక బాత్‌రూమ్ వుండటాన్ని గుర్తించారు. జగ్గంపేట మండలంలోని సగరపేట గ్రామంలో శివశక్తి మహిళామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను తనిఖీ చేసిన అధికారులు అక్కడ 51 మంది విద్యార్థులకు 20 మందికే హాజరు వుండటం గమనించారు. విద్యార్థులకు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు. కాకినాడలోని పర్లోపేటలోని ఇమ్మానియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను, ముగ్గుపేటలోని సత్యప్రద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను, వాకలపూడి గ్రామంలో సాధన స్వచ్ఛంద సంక్షేమ సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఏలేశ్వరంలోని సృజన స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ రోజు తనిఖీలు నిర్వహించిన ఏ ఒక్క హాస్టల్‌లో కూడా ఎస్‌ఎస్‌వై నిబంధనల మేరకు నిర్వహించడం లేదని గుర్తించామని విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. సిబ్బంది ఎవరూ పూర్తి స్థాయిలో వుండకపోవడం, హాస్టళ్లలో రాత్రిపూట ఎవరూ పడుకోకపోవడం, హాస్టళ్లు అన్నీ చిన్నచిన్న రెండు లేదా మూడు గదుల ఇళ్లల్లో 50 మంది విద్యార్థులకు నిర్వహిస్తున్నారని గుర్తించినట్టు చెప్పారు. బాత్‌రూమ్‌లు, టాయిలెట్స్ కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే వున్నాయన్నారు. కాస్మెటిక్ చార్జీలు కూడా విద్యార్థులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించిన వైనాలు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాస్మెటిక్ చార్జీలు గానీ, సెలూన్ ఖర్చులు గానీ, బాలికలకు నేప్కిన్లు తదితర టాయిలెట్స్ వస్తువుల చార్జీలు గానీ, వైద్య ఖర్చులకు సంబంధించి ఏ విధమైన పరీక్షలు చేయించడం లేదని గుర్తించారు. నిబంధనల ప్రకారం 50 మంది విద్యార్థులతో స్టూడెంట్ ప్రొఫైల్, సిబ్బంది హాజరు పట్టీ, విద్యావలంటీర్, డైరీ, విజిటర్స్ పుస్తకం, స్టాక్ రిజిస్టర్, నగదు, జమ, ఖర్చుల వివరాలు, బిల్లుల చెల్లింపుల రిజిస్టర్, రోజువారీ వేతనాల రిజిస్టర్ నిర్వహించాల్సి వుండగా ఏ సీజనల్ హాస్టల్‌లో కూడా పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించామని విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్సీ పి ముత్యాలనాయుడు, విజిలెన్స్ అధికారులు వై సత్యకిషోర్, టి రామ్మోహన్‌రెడ్డి, బి సాయి రమేష్, పీడీ రత్నకుమార్, జి గోపాలరావు, జె భార్గవ మహేష్, విజిలెన్స్ సిబ్బంది, ఎంఈవోలు పాల్గొన్నారు.