తూర్పుగోదావరి

ఎల్‌ఈడీ దీపాల్లో జాతీయస్థాయిలో జిల్లా ప్రథమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 25: ఎల్‌ఈడి వీధి దీపాలు ఏర్పాటులో ఏపీ జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని, దీనిలో తూర్పుగోదావరి జిల్లా పూర్తిస్థాయి ఎల్‌ఈడి దీపాలు కలిగిన జిల్లాగా రికార్డు సృష్టించిందని మంత్రి కళావెంకట్రావు చెబుతూ ఆ శాఖ సీఎస్ అజయ్‌జైన్‌ను అభినందించారు. దీనికి కృషిచేసిన జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ చింతా సత్యనారాయణను అజయ్‌జైన్‌తో పాటు, మంత్రి కళావెంకట్రావు తదితరులు అభినందించారు. అలాగే అమలాపురం డివిజన్‌లో అన్ని పంచాయితీల్లో ఎల్‌ఈడీ వీధిదీపాలు విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు అమలాపురం డివిజన్ ట్రాన్స్‌కో డీఈఈ పి సాల్మన్‌రాజు తెలిపారు. కోనసీమలో రైతులకు కూడా సౌర ఇంధన సామర్ధ్యం గల పంపుసెట్లు అందించామని సాల్మన్‌రాజు పేర్కొన్నారు.

పోలీసుస్టేషనులో ఇంటర్ పరీక్ష పేపర్లు
అమలాపురం, ఫిబ్రవరి 25: ఈనెల 27 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు అమలాపురం టౌన్ పోలీస్టేషన్‌లో భద్రపరిచినట్లు ఏ వింగ్ చీఫ్ సూపరింటెండెంట్ నక్కా వెంకటరమణ తెలిపారు. అమలాపురంలో పరంజ్యోతి, ఎస్‌కెబీఆర్ కళాశాలల్లో మాత్రమే ఇంటర్ ఓకేషనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతవారణంలో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఇన్విజ్‌లేటర్లకు పూర్తి ఆదేశాలు జారీచేసినట్టు ఆయన చెప్పారు.

పురమందిర భూమికి హక్కుదారుడిని నేనే
- జేవీఎస్ రామర్స్
అమలాపురం, ఫిబ్రవరి 25: అమలాపురం రూరల్ పేరూరు గ్రామంలో సర్వే నెం. 296-2కు సంబంధించిన 0.80 సెంట్లు భూమి దానం చేసిన భూమి క్రయ విక్రయాలు చేసిన ప్రయత్నాలు అడ్డుకుంటామని పేరి విశ్వనాధశర్మ విలేఖరులతో ఆదివారం తెలిపిన సమాచారం అసత్యమని, అన్ రిజిస్టర్డు ప్రైవేటు కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేవీఎస్ రామర్సు ఖండించారు. ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ పత్రికలకు సమాచారం ఇచ్చిన నడింపల్లి సుబ్బరాజు, పేరి విశ్వనాధశర్మ రద్దయిన అన్ రిజిస్టరు కమిటీలో సభ్యులు మాత్రమేనన్నారు. 1920 సంవత్సరంలో పురమందిరం స్థలం, అందులోని భవనం మా తాతగారు స్వర్గీయ రామోజీ భానో తన ఎస్టేట్ల వ్యవహారంలో డచ్ టైపు బిల్డింగ్ నిర్మించుకుని మా తాత, మా తండ్రిగార్ల మొదట హిందూ మిడిల్ స్కూలు, దరిమిలా టౌన్ హాలు కమిటీల కార్యకలాపాలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారని జేవీఎస్ రామర్స్ తెలిపారు. ఈ పురమందిరం స్థలాన్ని మా తాత రామోజీ భానో ఎవరికీ దానం ఇవ్వడం గానీ, అన్యాక్రాంతం గానీ చేయలేదన్నారు. వారి తదనంతరం వారి వారసుడిగా సర్వే నెం. 4851-71 రిజిష్టరు పారీకత్తు రీత్యా ఈ ఆస్తి తనకు సంక్రమించిందన్నారు. 147-48లో పెట్టిన రిజిష్టర్డు టౌన్‌హాల్ కమిటీ 1960లో రద్దయిందని తెలిపారు. ఆ సమయానికి కమిటీకి ఎట్టి స్థిర, చర ఆస్తులు లేవని సొసైటీ రిజిష్ట్రారు నిర్ధారించారని జేవీఎస్ రామర్స్ తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు అర్థరహితమని, ఎటువంటి అక్రమాలు తాను జరపలేదన్నారు. 14-2-2019 తేదీన రద్దయిన అన్ రిజిష్టర్డు కమిటీ మినహా ఏ ఇతర కమిటీలు ఏర్పడలేదని, ప్రతికల్లో వెలువడిన కమిటీలు లేనే లేవని జేవీఎస్ రామర్స్ స్పష్టం చేశారు.