తూర్పుగోదావరి

పోలీసుల తీరు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొండంగి, ఆగస్టు 30: కోన తీర ప్రాంతంలో ఏర్పాటుచేయనున్న దివీస్ లేబరేటరీ మందుల కంపెనీ వద్దంటూ ధర్నా నిర్వహించిన ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. దానవాయిపేట పంచాయతీ తాటాకులపాలెం, వంటిమామిడి, కొత్తపాకలు, పంపాదిపేట గ్రామాల సమీపంలో దివీస్ లేబరేటరీ కంపెనీని ఇక్కడ ఏర్పాటుచేయవద్దంటూ ఉద్యమించిన రైతులతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అధికార పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుల ప్రోత్సాహంతో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్నారు. తమ పార్టీ సారధ్యంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేసి ఈ ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటుచేయకుండా అడ్డుకుంటామని మధు స్పష్టం చేశారు. దివీస్ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు 23మందిపై కేసులు నమోదుచేశారని, వాటిని తక్షణం ఉప సంహరించుకోవాలని మధు డిమాండు చేశారు. వచ్చే నెల 6న పంపాదిపేటలో భారీ ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మధు తెలిపారు.