తూర్పుగోదావరి

బొక్కు సొరచేపను చంపితే ఏడే ళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే బొక్కు సొర చేపను చంపినవారికి ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చని చట్టంలోని షెడ్యూల్ 1 చెబుతోందని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. సాగర జలాలను శుభ్రపరిచి, మానవాళికి ఎంతో మేలు చేస్తున్న బొక్కు సొర చేప పరిరక్షణకు కృషిచేయాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందన్నారు. స్థానిక రంగరాయ వైద్య కశాశాల ఆడిటోరియంలో ఎగ్రీ ఫౌండేషన్, అటవీ శాఖలు సంయుక్తంగా మంగళవారం ప్రపంచ బొక్కు సొర చేప దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించే శక్తి బొక్కు సొర చేపకు మాత్రమే ఉందన్నారు. అంతరించిపోతున్న జల, జీవరాశులను రక్షించడంతో మానవాళికి మేలు చేకూరుతుందన్నారు. ఈ చేప ప్రాధాన్యతపై మత్స్యకారులకు అవగాహన కలుగజేయాల్సి ఉందని చెప్పారు. బొక్కు సొరచేప ద్వారా వచ్చే ఆయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చన్న కారణంతో కొందరు ఈ చేపను వధిస్తున్నారని, ఇది చాలా బాధాకరమన్నారు. ఈ జాతి చేపలను చంపరాదంటూ సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా మత్స్యకారులతో పాటు అన్ని వర్గాలకు ప్రచారం చేయాల్సిన గురుతరమైన బాధ్యత అందరిపై ఉందన్నారు. వలలో చిక్కిన ఈ చేపను విడిచిపెట్టే మత్స్యకారులకు మత్స్యశాఖ ద్వారా తగిన పరిహారం అందజేస్తామని తెలియజేశారు. ఇందుకు మత్స్యకారులకు యాప్ అప్లికేషన్ తయారుచేశామని, పేరు, ఫోన్ నెంబరు, జిల్లా, గ్రామం టైపు చేసి, చేప ఫొటోలు, వాటిని విడిచి పెట్టే ఫొటోలను పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వలలో చిక్కిన బొక్కు సొర చేపలను సముద్రంలో విడిచిపెట్టిన పొట్టిలక్ష్మి గ్రూపు మత్స్యకారులకు కలెక్టర్ 18వేల నష్ట పరిహారం చెక్కును అందజేశారు. యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ డి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ బొక్కు సొర చేప సముద్రాన్ని శుభ్రం చేసే స్కావెంజర్ మాదిరిగా పనిచేస్తుందని చెప్పారు. ఎగ్రీ ఫౌండేషన్ స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ కె తులసీరావు మాట్లాడుతూ దీని పొడవు 42 అడుగులు, బరువు 21 టన్నుల వరకు ఉంటుందని, ఈ చేప దూరం నుండి వలస వస్తుందని వివరించారు. రాజమహేంద్రవరం జిల్లా అటవీ శాఖాధికారి వి ప్రభాకరరావు, కాకినాడ డిఎఫ్‌ఒ ఎం శ్రీనివాసరావు, మత్స్యశాఖ డిడి రామతీర్థం, ధరిత్రి ఫౌండేషన్ ప్రతినిధి ఎస్ సురేఖ, కా=కినాడ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్‌ఒ అప్పన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.