తూర్పుగోదావరి

డ్రెడ్జింగు జరిగేనా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: అఖండ గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌పై సందేహలు ముసురుకుంటున్నాయ. ఇసుక మాఫియా డ్రెడ్డింగ్ జరగకుండా అడ్డుపడుతున్నట్టు సమాచారం. సుమారు 30 అడుగుల ఎత్తుకు ఇసుక పేరుకుపోయి లోతు తగ్గిపోయినట్టు అంచనా వేస్తున్నారు. గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ గత ఏప్రిల్ నెలలోనే చేపట్టాల్సి వుంది. టెండర్లు పిలిచి రూ.16.52 కోట్ల అంచనా విలువతో పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు పూర్తిచేశారు. ఎట్టకేలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. దాదాపు గత రెండు నెలలుగా డ్రెడ్జర్లను రాజమహేంద్రవరం సమీపంలో వుంచారు. ఈ డ్రెడ్జర్లకు పనిలేక తుప్పుపడుతున్నాయ. డ్రెడ్జింగ్ ప్రక్రియను ఆపేందుకు ఇసుక మాఫియా శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆర్థిక శాఖ క్లియరెన్సు వచ్చినప్పటికీ ఇంకా ఏదో విధంగా డ్రెడ్జింగ్ చేపట్టకుండా అడ్డుపడుతున్నట్టు తెలిసింది. ఇందుకు కొందరు ఇరిగేషన్ శాఖ అధికారులు మాఫియాకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదావరి నదిలో డ్రెడ్జింగ్ చేపడితే ఇసుకకు ఎటువంటి కొరతకు తావుండదు. దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభిస్తుందని అంచనా వేశారు. డ్రెడ్జింగ్ లేకపోవడం వల్ల ఏటికేడాది నదీ గర్భం కుచించుకుపోతూ ఇసుక పూడిక పెరిగిపోయి నీటి లభ్యత తగ్గిపోతోంది. దీంతో రబీలో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది. అయితే డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపడితే ఇసుక ఇబ్బడి ముబ్బడిగా లభించి మాఫియా ఆగడాలకు తావుండదు. వారు చెప్పిన రేట్లకు ఇసుకను తీసుకునే దందాకు కాలం చెల్లుతుంది. కృత్రిమ కొరత సృష్టించేందుకు అవకాశం వుండదు. ఈ నేపథ్యంలోనే మాఫియా డ్రెడ్జింగ్ పనులు చేపట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వైపు కొత్తగా ఇసుక ర్యాంపులు లేకుండా చేయడంలో కూడా మాఫియా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వున్నాయి. అసలు డ్రెడ్జింగు జరుగుతుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయ. డ్రెడ్జింగ్ పనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతుండటం వల్ల నష్టపోతున్నట్టు కాంట్రాక్టు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రోజుకు రోజుకు రూ.15 వేల నష్టాన్ని చవి చూస్తున్నట్టు తెలిసింది. డ్రెడ్జర్లను తుప్పు పట్టకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను కోరుతున్నట్టు తెలిసింది. డ్రెడ్జింగ్ ద్వారా తీసే ఇసుకను ఎక్కడ నిల్వ చేయాలో తెలియని స్థితిలో ఆలస్యమవుతున్నట్టుగా ఇరిగేషన్ అధికారులతో ఉన్నతాధికారులకు చెప్పిస్తున్నట్టుగా తెలిసింది. ఏదేమైనప్పటికీ వెంటనే డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపట్టి నిరంతరం ఇసుక దిబ్బలను, మేటలను తొలగించేందుకు చర్యలు చేపడితే ఇటు నదీ గర్భం పెరిగి రానున్న రబీ కాలానికి నీటి నిల్వలు పెరగడంతోపాటు, ఇసుక కూడా విరివిగా లభించేందుకు అవకాశం లభిస్తుందని జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు.