తూర్పుగోదావరి

జెఎన్‌టియుకె కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆదేశాలు మేరకు జెఎన్‌టియుకె పరిధిలోని అన్ని కళాశాలల్లో బయో మెట్రిక్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ విఎస్‌ఎస్ కుమార్ తెలియజేశారు. వర్శిటీ అలూనీ ఆడిటోరియమ్‌లో మంగళవారం ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ విధానంపై జెఎన్‌టియుకె అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు వేసే సమయంలో అక్రమాలు చేటుచేసుకునే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టేందుకు ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. అదే విధంగా జియోట్యాగింగ్ పద్ధతిని సైతం అనుసరిస్తామన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు అనుసంధానమయ్యే పద్ధతి, ఆధార్ కార్డులో ఉన్న చివరి ఎనిమిది నెంబర్లతో అనుసంధానం కావడం తదితర వాటిపై సూచనలు చేశారు. ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు మాట్లాడుతూ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న హోర్డ్‌వేర్ ద్వారానే బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలన్నారు. ఈ పోస్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌కు, సిఎం డ్యాష్‌బోర్డుకు, జెఎన్‌టియుకె పోర్టల్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. కార్యకమ్రంలో రెక్టార్ ప్రొఫెసర్ బి ప్రభాకరరావు, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, ఒఎస్‌డి ప్రొఫెసర్ కెవి రమణ, డిఇ ప్రొఫెసర్ పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.