తూర్పుగోదావరి

9999 నంబరు కోసం పోటీపడ్డ ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, సెప్టెంబర్ 1: మండలంలోని కత్తిపూడిలోగల మినీ రవాణా కార్యాలయంలో 9999 నంబరు కోసం ప్రముఖులు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కత్తిపూడి చెక్‌పోస్టులో ఎపి05 డిబి 9999 నంబర్ కోసం ఐదుగురు పోటీపడ్డారు. దీనితో చెక్‌పోస్టులోనే సీక్రెట్ వేలం నిర్వహించారు. ఈ ఐదుగురు పోటీదారుల్లో ఒకరి తరుపున జిల్లా డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, శంఖవరం మండలం టిడిపి నాయకులతో చెక్‌పోస్టుకు చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేలంలో కూర్చున్న ఐదుగురిలో ఇద్దరు పోటీ నుంచి తక్షణమే విరమించుకోవడంతో మిగిలిన ముగ్గురు వ్యక్తులైన సాగి వీర వెంకట సత్య సుబ్రహ్మణ్య వర్మ, సిహెచ్ కళ్యాణరాజు, ఎన్‌వి సత్యనారాయణల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు ఉండటంతో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎస్‌వివిఎస్‌ఎస్ వర్మ ఎపి 05 డిబి 9999 నంబర్‌ను రూ.1,10,000లకు చేజిక్కించుకున్నారు. మిగిలిన పాటదారులైన ఎన్‌వి సత్యనారాయణ రూ.1,02,000లు, సిహెచ్ కళ్యాణరాజు రూ.1,02,900లు కోడ్ చేయడంతో అవకాశం కోల్పోయారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బద్ధి రామారావు, టిడిపి నాయకులు పర్వత సురేష్, వెన్నా శివ, గౌతు నాగు, సర్పంచ్‌లు దువ్వాడ సాల్మన్‌రాజు, కీర్తి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.