తూర్పుగోదావరి

అపరిశుభ్ర వాతావరణంతో ప్రబలుతున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, సెప్టెంబరు 1: అపరిశుభ్ర వాతావరణం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి ప్రబలుతోందని డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె చంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన రాయవరం పిహెచ్‌సి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 92 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు నిర్వహించే కార్డు పరీక్ష పద్ధతి వల్ల పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. గ్రామాల్లో బాధితులను గుర్తిస్తే అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లాలో పెద్దాపురం, కాకినాడ రూరల్ నుండి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 645 శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాటుచేయాల్సి ఉండగా, ఇప్పటికే 280 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జ్వర విభాగం ఏర్పాటుచేశామని, పిల్లల కోసం పిఐసియు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జిల్లాలో 24 ఆసుపత్రుల్లో 24 గంటల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మాతాశిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, లక్ష మందిలో 34 మంది తల్లులు, 77మంది చిన్నారులు మృతిచెందుతున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ పథకంలో భాగంగా సెప్టెంబరులో పదివేల మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించడం లక్ష్యమన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ వ్యాధి రాదన్నారు. అనంతరం డిఎంహెచ్‌ఒ వైద్యశాలలో రికార్డులు పరిశీలించి, పిహెచ్‌సి వైద్యాధికారిణి కె నిరూపకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ టి వెంకట్రామారెడ్డి పాల్గొన్నారు.