తూర్పుగోదావరి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పాలు, గుడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 1: మాతా, శిశు మరణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల తోడ్పాటు, భాగస్వామ్యం అత్యవసరమని జిల్లా మహిళా, శిశు సంజీవిని ప్రోజెక్ట్ కో-ఆర్డినేటర్ హెచ్ శ్రీదేవి కోరారు. జిల్లాలో మాతా, శిశుమరణాలను తగ్గించే లక్ష్యంగా ఐసిడిఎస్, వైద్యరోగ్య శాఖ, మహిళా సమాఖ్యల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పాలు, పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు, సంస్ధల సహకారాన్ని ఆమె కోరారు. ప్రస్తుతం తమ ప్రోజెక్ట్ ద్వారా జిల్లాలో పైలెట్ ప్రతిపాదికన గుర్తించిన 50 గ్రామీణ, పట్టణ ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తొలుతగా చేపట్టామన్నారు. పౌష్టికాహారం ద్వారా మాతా శిశుమరణాలను తగ్గించే లక్ష్యంగా ఐసిడిఎస్ ద్వారా నెలలో 16 రోజుల పాటు పంపిణీ చేస్తున్న కోడి గుడ్లతో పాటు ప్రజలు అందించే పాలు లేదా రాగజావ కూడా గర్భిణులకు పంపిణీ చేస్తామన్నారు. 50 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రామ సర్పంచ్, కార్యదర్శులు, గ్రామ మహిళా సమాఖ్యలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అందరి సహకారం కోరామని ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం గురువారం జిల్లాలో తూరంగి, దొంతికుర్రు, గాడిమొగ వంటి గ్రామాల్లో ప్రారంభమయిందన్నారు. త్వరలో జిల్లా అంతా విస్తరిస్తామని శ్రీదేవి చెప్పారు. వీటికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రజలు, స్వచ్ఛంద సంస్ధలు, వితరణ శీలురులను కోరారు.