తూర్పుగోదావరి

విద్యార్థుల కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 1: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకొని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా పిలుపునిచ్చారు. స్థానిక జెఎన్‌టియుకె అలూనీ ఆడిటోరియంలో గురువారం అంకురార్పణ కేంద్రాల్లో ఆవిష్కరణలపై మేథోమథనం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సుమితా దావ్రా హాజరై మాట్లాడుతూ సృజనాత్మకత అనేది తయారుచేసేది కాదని, సహజ రీతిలో ఏర్పడేదన్నారు. విద్యార్థులంతా సృజనాత్మకతను పెంపొందించుకుని నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టి వ్యవస్థాపకులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి సంస్థల్లో మూడువంతుల మంది చైనీయులు, భారతీయులు తమ ప్రతిభను చాటి చెబుతున్నారని తెలిపారు. ఎక్కడైతే సాధించాలనే తపనతో అనే్వషణ ఉంటుందో అక్కడే ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు కేవలం అధ్యాపకులపై ఆధారపడకుండా పలువిషయాలను అకళింపు చేసుకోవాలని, దీనికోసం పుస్తకాలు, ఇంటర్నెట్, శిక్షణా కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. ఏ దేశానికైనా పరిశోధన, అనే్వషణాంశాలు మూల కారణమని, కొత్త యాప్‌ల రూపకల్పనపై దృష్టి సారించాలన్నారు. ఓయో, రెడ్‌బస్ యాప్‌ల సేవలను కొనియాడుతూ ఈ రకమైన యాప్‌ల రూపకల్పనకు కృషిచేయాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా కోరారు. సదస్సులో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ విఎస్‌ఎస్ కుమార్ మాట్లాడుతూ అంకురార్పణ కేంద్రాలు అనే్వషణలకు మూలకేంద్రాలన్నారు. నూతనంగా చేపట్టే ప్రాజెక్టులు ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాదరాజు, రెక్టార్ ప్రొఫెసర్ బి ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, ఒఎస్‌డి ప్రొఫెసర్ కెవి రమణ, కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎ గోపాలకృష్ణ, డైరెక్టర్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్లు, వైస్ ప్రిస్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అనుబంధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.