తూర్పుగోదావరి

శంఖవరంలో బాలికల కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, సెప్టెంబర్ 1: హైస్కూలుకు చదువుకునేందుకు వెళుతున్న బాలికలను ఆటోలో కిడ్నాప్ చేశారనే ప్రచారం మండల కేంద్రం శంఖవరంతోపాటు పరిసర గ్రామాల్లోనూ గురువారం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వార్త గ్రామాల్లో దావానలంలా వ్యాపించడంతో విధ్యార్థినుల తల్లిదండ్రులు హైస్కూలుకు పరుగుపెట్టారు. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందించడంతో అన్నవరం ఎస్సై పార్ధసారధి పోలీసు బందోబస్తుతో శంఖవరం హైస్కూలుకు చేరుకుని విచారణ చేస్తూనే, మరికొంతమంది పోలీసులతో పలుమార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. శంఖవరం గ్రామ శివారున గల జడ్పీ హైస్కూలుకు శంఖవరం మండలంలోని శంఖవరం, నెల్లిపూడి, వి వెంకటాపురం, జి కొత్తపల్లి, గౌరంపేట, ఎస్ జగ్గంపేట గ్రామాల నుంచి, రౌతులపూడి మండలంలోని ఎం చామవరం, పి చామవరం, శృంగవరం, బంగారయ్యపేట గ్రామాల నుంచి విద్యార్థులు బస్సులు, ఆటోలు, సైకిళ్లపై వస్తూంటారు. అయితే రోజూ మాదిరిగానే సమీప గ్రామాల నుంచి కొంతమంది నడిచి, మరికొంత మంది సైకిళ్లపై వస్తున్నారు. మరి కొంతమంది ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలు లేదా ఆటోలను లిఫ్ట్ అడిగి వెళ్లడం పరిపాటిగా మారింది. ఎప్పటి మాదిరిగానే శృంగవరం, మెరక చామవరం గ్రామాల నుండి నడిచి వస్తున్న ముగ్గురు విద్యార్థినులు కొప్పిశెట్టి గౌరీ శిరీష, పప్పుల కల్యాణి, పప్పుల ప్రశాంతిలు మార్గ మధ్యలోగల ఫ్యాక్టరీ తోటకు చేరేసరికి రోడ్డు పక్కనే ఆగివున్న ఆటోలోని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వారిని ఆటో ఎక్కించేందుకు ప్రయత్నించగా విద్యార్థినులు అప్రమత్తమై వేగంగా వెనుతిరిగి ఏడుస్తూ ఇంటికి పరుగులు తీసి తల్లిదండ్రులకు విషయం తెలియపరిచారు. మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుచున్న శృంగవరం గ్రామానికి చెందిన విద్యార్థిని జట్లా అపర్ణ తాను బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉండగా గూడుతో ఉన్న లగేజీ ఆటో వచ్చి ఆగిందని, దానిలో ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో తాను తిరస్కరించినట్టు పేర్కొంది. దీనితో విద్యార్థినుల తల్లిదండ్రులు విషయాన్ని హైస్కూలులోని ఉపాధ్యాయులకు, అన్నవరం పోలీసులకు సమాచారమిచ్చారు. హైస్కూలుకు చేరుకున్న పోలీసులు కిడ్నాప్ కాబోయామని భయపడిన విద్యార్థినులను విచారించి ఉపాధ్యాయులతో పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. దీనితో హైస్కూలుకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వారి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారా.. లేదా... అని నిర్ధారణ చేశారు. దీనితో విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో ఉపాధ్యాయులు, పోలీసులు, పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో విధ్యార్థినుల తల్లిదండ్రులు, ఎంఇఒ కమలాదాస్, ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త పర్వత రాజబాబు హైస్కూలుకు చేరుకుని హెచ్‌ఎం పద్మావతిని విద్యార్థుల క్షేమంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.