తూర్పుగోదావరి

తీవ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: భారత సైనిక స్థావరాలపై పాక్ ప్రేరేపిత జైషీ మహ్మద్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో సోమవారం పాకిస్తాన్ ఉగ్రవాది దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రధాని మోదీ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడాన్ని సహంచలేక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్‌పైకి పంపిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేదిగా మారిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, యెనుముల రంగబాబు, సత్తి మూలారెడ్డి, దాస్యం ప్రసాద్, బూరా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ సిటీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన భారత జవానుల మృతికి మాజీ సైనికులు, ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. కాశ్మీర్‌లో ఆదివారం వేకువ జామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 18మంది భారత జవానులు మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. భారత సైనికులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. కాకినాడ నగరం జిల్లా పరిషత్ సెంటర్ ప్రాంతంలో ఉన్న అమర వీరుల స్థూపం వద్ద సోమవారం రాత్రి వారు కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన సైనికులకు ఆత్మశాంతి కలగాలని కొద్దిసేపు వౌనం పాటించారు. అమరులైన సైనికులు కుటుంబ సభ్యులకు మాజీ సైనికులు తమ సానుభూతి వ్యక్తపరిచారు. ఈకార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు, ప్రజలు పాల్గొన్నారు.
చింతూరు: కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడికి ఖండిస్తూ ఎస్సీ వసతి గృహ విద్యార్థులు సోమవారం రాత్రి చింతూరు ప్రధాన సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ చేబట్టారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు నివాళులర్పించారు. అనుసూచిత్ జాతి నాయకుడు చదలవాడ కృపాకుమార్ మాట్లాడుతూ సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదులను శిక్షించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన సైనికులకు జోహార్లంటూ నినదించారు.
అమలాపురం : పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన సైనికులు ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అమలాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారస్థంభం సెంటర్ నుండి పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించి అమర సైనికులకు జోహారులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షుడు యర్రమెల్లి విశే్వశ్వరరావు, యర్రా నాగబాబు, సిఐ వై ఆర్‌కె శ్రీనివాస్, కాళ్ళకూరి సత్యనారాయణ, బివియన్ మల్లేశ్వరరావు, మిండగుదుటి మోహన్, గంటి దత్తాత్రేయశర్మ, కల్వకొలను తాతాజీ, పెనుమాల చిట్టిబాబు, నంబూరి శ్రీనవాస్, బివి హనుమంతరావు, సలాది సత్యనారాయణమూర్తి, జనపరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు