తూర్పుగోదావరి

ఇన్‌ఫార్మర్ల నెపంతో హత్యలు చేయడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 19: గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోలు హత్యలకు పాల్పడడం తగదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ హితవు పలికారు. ఏజెన్సీ ప్రాంతంలో గత జూలై 29వ తేదీన మావోల చేతులో హత్యకు గురైన పాస్టర్ వి మారయ్య ప్రభుత్వం ప్రకటించిన 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆయన భార్య మంళదేవికి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అందజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చెక్‌ను పాస్టర్ భార్యకు అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ రవిప్రకాషా మాట్లాడుతూ ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను మావోలు హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాస్టర్ మారయ్య కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి రావలసి ఉన్ని అన్ని రాయితీలు వచ్చేటట్లు కృషి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో ఒఎస్‌డి వై రవిశంకర్‌రెడ్డి, ఎస్‌బి డిఎస్పీ ఆర్ విజయభాస్కర్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.