తూర్పుగోదావరి

అంగరలో పోలీస్ పికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కపిలేశ్వరపురం, సెప్టెంబర్ 19: మండలంలోని అంగర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలపై గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గీయులు రాళ్లు రువ్వారంటూ దళితులు ఆరోపిస్తూ అంగర పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సినీ నటుడు చిరంజీవి ఫ్ల్లెక్సీని చింపివేశారంటూ కాపు సామాజిక వర్గీయులు చేసిన ఫిర్యాదుపై కూడా అంగర పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా జరిగిన ఒక వివాదం పెద్దది కావడంతో రామచంద్రపురం డిఎస్పీ మురళీకృష్ణ, మండపేట సిఐ పుల్లారావుల పర్యవేక్షణలో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 17న కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైకుపై దళితపేట మీదుగా వెళుతుండగా కొంతమంది అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 18న కూడా ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై కేసులు నమోదుచేశామని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు పికెట్ ఏర్పాటుచేసినట్టు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనధికార ఫ్లక్సీలు తొలగించాలని తహసీల్దార్ జి చిన్నిబాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాల్లోను, రహదారుల పక్కన ఏర్పాటుచేసిన అనుమతుల్లేని ఫ్లక్సీలను వెంటనే తొలగించాలని, లేనట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.