తూర్పుగోదావరి

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం, సెప్టెంబర్ 19: మండలంలో కాళ్లవాపు కేసులు ఇంకా వస్తున్న సందర్భంలో సీజనల్ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రంపచోడవరం ఐటిడిఏ పిఒ చక్రధరబాబు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధి చినమట్టపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో ఎవరికైనా జ్వరాలు కాని, కాళ్లవాపులు కాని వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు రావాలని సూచించారు. అనంతరం ఆయన మండల స్థాయి అధికారులతో స్థానిక ఎఎస్‌డిఎస్ కార్యాలయ సమావేశ మందిరం వద్ద సమావేశం నిర్వహించారు. వచ్చే పదిరోజుల్లో గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగూ, చికెన్‌గున్యా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే దగ్గరలోని పిహెచ్‌సికి తరలించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలకు ఆర్‌డబ్య్లుయస్ అధికారులు టిన్నులతో మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల కుసుమాంబ, అడిషినల్ డిఎంహెచ్‌ఒ పవన్‌కుమార్, ఎంపిడిఒ సరోవర్‌రావు, కూనవరం తహసీల్దారు నరసింహులు, ఆర్‌ఐ సుబ్బారావు, మెడికల్ అఫీసర్‌లు దుర్గాప్రసాద్, ప్రదీప్, గాంధీబాబు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.