తూర్పుగోదావరి

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, సెప్టెంబర్ 19: ఇటీవల జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల మూఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ విలేఖరులు సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని మండపేట, పెద్దాపురం, సామర్లకోటలో ఇటీవల జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి డిఎస్పీ రాజశేఖర్ రావు ఆదేశాల మేరకు పోలీసులు, క్రైమ్ బ్రాంచి సిఐ బివి రమణ ఆధ్వర్యంలో క్రైమ్ సిబ్బంది తీవ్ర గాలింపు చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలు గాలింపులో భాగంగా కిర్లంపూడి మండలంలో క్రిష్టవరం నేషనల్ హైవే రోడ్డులో టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి హైదరాబాద్ నుండి వైజాగ్ వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న పచ్చిమ గోదావరి జిల్లా కామరపుకోట మండలం పాత కొండగూడెం గ్రామానికి చెందిన చీకట్ల సతీష్, పెనుగొండ గ్రామానికి చెందిన మద్దుల రాజేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్ రాష్ట్ర దొంగతనాల కేసుల్లో వీరు ముద్దాయిలుగా గుర్తించినట్టు సిఐ తెలిపారు. వీరు తీవ్ర నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. జిల్లాతోపాటు పలుప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడయ్యిందన్నారు. వీరిలో చీకట్ల సతీష్ కరుడుగట్టిన నేరస్థుడని తెలిపారు. వీరిచ్చిన సమాచారం మేరకు విశాఖపట్నం జిల్లా మర్రిపాలెంకు చెందిన కాలింగ అశోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్దనుండి దొంగసొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. జూలై నెలలో పెద్దాపురంలో రాజుగారి వీధిలోని శ్రీనివాస క్లినిక్ ఎదురుగా నివాసం ఉంటున్న పశుమర్తి సాయిగీతకు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారును వీరు దొంగిలించారన్నారు. అలాగే మండపేటలో జరిగిన భారీ దొంగతనంలో కూడా వీరి హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. హైదరాబాద్, తణుకు, ఇరగవరం, జంగారెడ్డి గూడెం, గన్నవరం, విజయనగరం,వైజాగ్, పాలకొల్లు,మండపేట, కాళ్ల,పెద్దాపురం, తదితర ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. పచ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగుడెంలో మహిళా హత్య కేసులో చీకట్ల సతీష్ ముద్దాయిగా ఉన్నట్టు సిఐ తెలిపారు. ఇతడు దొంగతనానికి వెళ్లి అవసరమైతే హత్యలకు కూడా పాల్పడే కరుడు గట్టిన నేరస్థుడన్నారు. ఈ ముఠాపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీస్ స్టేషన్లతో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నయన్నారు. అంతర్ రాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి, వారిపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టినట్టు సిఐ తెలిపారు. వీరిని పిటి వారెంట్ కింద పలు స్టేషన్లలో విచారించాల్సి ఉందన్నారు. ఈ ముఠా నుండి చోరీ చేసిన స్విఫ్ట్ డిజైర్ కారుతో పాటు, పల్సర్ బైక్, వెండి, బంగారు వస్తువులు, ల్యాప్ టాప్, ఐ ఫోన్, సెల్ ఫోన్లు, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు, రూ. 4.65లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానా స్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ వీరయ్య గౌడ్ సూచించారు. ఇటీవల సామర్లకోటలో మహిళా హత్య, దొంగతనం కేసును చాలెంజింగ్‌గా తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నామన్నారు, త్వరలోనే నిందుతులను అరెస్టు చేస్తామన్నారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేయడంతో పలు కేసుల్లో చిక్కుముడి వీడే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ముఠాను అరెస్టు చేసిన క్రైమ్ ఎస్సై వలి,పెద్దాపురం ఎస్సై యడవిల్లి సతీష్, ఎఎస్సై బి నరసింహరావు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది జిఎస్‌ఎన్ మూర్తి, హెచ్‌సి బలరాంమూర్తి, రంగబాబు,రాధాకృష్ణ, రాకేష్, నాగరాజు, నాగభూషణం, కృష్ణ,సాయికృష్ణ, శ్రీనివాసరావులను సిఐ అభినంధించారు.