తూర్పుగోదావరి

పరిహారంపై పోరాటం ఆగదు: బద్రాచలం ఎమ్మెల్యే సున్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 19: పోలవరం నిర్వాసితులకు మేలైన పరిహారం అందేదాక సిపిఎం పోరాటం చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం చింతూరు ఐటిడిఎ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన 36 గంటల నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రాజెక్టు ముంపు భూములకు పట్టిసం తరహాలో పరిహారం ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లింపులో ప్రజలను మోసం చేస్తే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిపిలు చిచ్చడి మురళి, కొమరం పెంటయ్య, కారం సిరమయ్య, సిపిఎం నాయకులు మిడియం బాబూరావు, దాకి శేషావతారం, యర్రంశెట్టి శ్రీనివాసు, పల్లపు వెంకట్, పరిటాల సత్యనారాయణ, కోట్ల కృష్ణ, సీసం సురేష్ తదితరులు పాల్గొన్నారు.