తూర్పుగోదావరి

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 19: భారత సైనికులపై దాడి చేసి సుమారు 20 మంది మృతిని నిరశిస్తూ ఉగ్రవాద దిష్టిబొమ్నను ఎబివిపి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. స్ధానిక భానుగుడి సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని సోమవారం చేశారు. మృతులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు కె సాయిరామ్, సాంబమూర్తి, సాగర్, వివిధ కళాశాలల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. పాక్ సైనికులు భారత సైనికులపై దాడిని నిరశిస్తూ టిడిపి మాజీ సైనిక విభాగం ఆవేదన వ్యక్తం చేసింది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడమే కాకుండా 20మందిని చంపటం పట్ల వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుతున్న వారికి దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు. వారికి ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి దేశ ప్రజల్లో చిరస్ధాయిగా గుర్తుంటారని సైనిక విభాగం జిల్లా అధ్యక్షుడు మూరా దత్తం పేర్కొన్నారు. అనంతరం సైనికుల మృతికి వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో విభాగం నాయకులు బత్తిన బాలకృష్ణ, చక్రం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.