తూర్పుగోదావరి

రాజమండ్రి - భద్రాచలం రోడ్డు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కోరుకొండ మండలంలో భారీ వర్షాలు కురిసాయి. రాజమహేంద్రవరం - భద్రాచలం రోడ్డులోని గాడాల వద్ద రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున రాకపోకలు స్తంభించాయి. పలు వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. రోడ్డుపై మొలలోతు నీరు ప్రవహించడంతో బైక్స్, ఆటోలు, బస్సులు తదితర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం ఉదయం నుండి వర్షం కురుస్తుండటంతో చెరువులు పొంగిపొర్లి పొలాలు నిండిపోయి రహదారులపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అదే విధంగా మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలోని మోదకొండమ్మ ప్రాంతం వరద నీటిలోనే ఉంది.
రాజానగరం: బుధ, గురువారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజానగరం మండలంలోని లోతట్టు ప్రాంతాలు, పలు గ్రామాలు పూర్తిస్థాయిలో జలమయమయ్యాయి. ముఖ్యంగా మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో ఉన్న కన్నయ్య చెరువు పొంగిపొర్లుతుండడంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై సుమారు మోకాలి లోతు మేర నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయమేర్పడింది. అలాగే చాగల్నాడు కాలువ పొంగి కొత్త వెలుగుబంద గ్రామంలోకి పొంగిపొర్లుతోంది. దీంతో గ్రామంలోని పలు గృహాలు పూర్తిగా వర్షపునీట మునిగాయి. రాజానగరంలోని న్యూ కాలనీ, తిరుమలా గార్డెన్ తదితర ప్రాంతాలు రావుల చెరువు పొంగిపొర్లడంతో నీట మునిగాయి. దివాన్ చెరువు గ్రామంలో నర్సచెరువు ప్రాంతం పూర్తిగా జలమయమైంది. నీట మునిగిన ప్రాంతాల్లో తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు ఆమె తెలిపారు.