తూర్పుగోదావరి

కుల ఘర్షణలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, సెప్టెంబర్ 22: కుల ఘర్షణలలో పాల్గొని యువత తమకు సంబంధించిన ఎంతో విలువైన భవిష్యత్తును అంధకార బంధురం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎం రవిప్రకాష్ హెచ్చరికతో కూడిన సూచన చేశారు. కుల ఘర్షణలలో పాలుపంచుకునేవారు ఎంతటి వారైన పోలీసు యంత్రాంగం విడిచిపెట్టదని, తీవ్ర సంఘటనలకు పాల్పడే వారిపై కేసులు బనాయించడమే కాకుండా, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండపేట పట్టణ పోలీసు ఠాణాను తనిఖీ చేసిన సందర్భంగా గురువారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. కుల ఘర్షణల అంశంలో జిల్లాలో అమలాపురం సబ్ డివిజన్ తొలి స్థానంలో ఉండగా, రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్ మలి స్థానంలో ఉందన్నారు. 3వ స్థానంలో పెద్దాపురం పోలీసు సబ్ డివిజన్ ఉందన్నారు. యువకులు తమ దృష్టిని విద్యార్జనపై కేంద్రీకరించి, ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎవరో చెప్పిన మాటలను నమ్మి, కుల సంఘర్షణలలో పాల్గొని, పోలీసు కేసులతో భావి జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకోవద్దని పదేపదే హితవు పలికారు. మండలస్థాయిలో శాంతి కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు, సామాజికపరంగా అందరూ కలసిగట్టుగా జీవనం సాగించాలన్నారు. శాంతి కమిటీలు ఈ అంశంపై నెలవారీ సమావేశాలలో సమీక్షలు చేస్తాయన్నారు.
యువతకు మత్తుమందులు సరఫరా చేసే బృంద సభ్యుల వివరాలు పోలీసు శాఖ వద్ద ఉన్నాయని, ఇద్దరి ముగ్గురిపై రౌడీషీట్లు కూడా ఓపెన్ చేసినట్లు తెలిపారు. ఇకనైనా యువతను పెడత్రోవపట్టించే చర్యలకు స్వస్తి పలకాలని ఎస్పీ డాక్టర్ ఎం రవిప్రకాష్ హెచ్చరించారు. సమావేశంలో రామచంద్రపురం డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, సిఐ (మండపేట పట్టణ పోలీసు స్టేషన్ అధికారి) హ్యాపీ కృపావందనం, ఎస్సై సురేష్, పిఎస్సై నసీరుద్దీన్‌లు పాల్గొన్నారు.