తూర్పుగోదావరి

రెండో రోజూ హోరాహోరీగా షటిల్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, సెప్టెంబర్ 22: కొత్తపేట రెడ్డి అనసూయమ్మ ఇండోర్ షటిల్ కోర్టులో జరుగుతున్న రాష్టస్థ్రాయి అండర్ 19 బాలబాలిక షటిల్ పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తొలిసారిగా కొత్తపేటలో ఈ పోటీలు జరుగుతున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో పోటీలను నిర్వహిస్తున్నారు.
రెండోరోజు విజేతలు వీరే
కొత్తపేటలో జరుగుతున్న రాష్టస్థ్రాయి షటిల్ పోటీల్లో తొలి రోజు రోజు అర్హత పోటీలు నిర్వహించగా, రెండవ రోజు నుంచి ఛాంపియన్‌పిష్ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలుర విభాగంలో కె సచిన్ (గుంటూరు) ఎస్ మణిదీపక్ (పశ్చిమ గోదావరి)ని, వై చంద్రపట్నాయక్ (విశాఖ), ఆర్ ఫృద్వీరాజ్ (తూర్పు గోదావరి)ని 21-14, 22-20, వై అమ్మనగౌడ్ (తూర్పు గోదావరి) వి చంద్రశేఖరరెడ్డి (చిత్తూరు)ను 21-12, 21-12తో, కెఎం రవి (విశాఖ) సిహెచ్ గోపాలప్రభాష్ (శ్రీకాకుళం)ను 21-8, 21-11 తేడాతో ఓడించారు. డి జస్వంత్ (చిత్తూరు) ఎం సాయికిరణ్ (విశాఖ)ను 21-16, 20-22, 21-14తో, టి విజయ్‌కుమార్ (పశ్చిమ గోదావరి) జి శ్రీనివాస్ (విజయనగరం)ను 21-10, 21-11తో, కెఆర్‌కె చరిత్ (విశాఖ) జి సుజిత్ (కర్నూల్)ను, ఎం శ్రీకర్ (శ్రీకాకుళం) పాల్‌ప్రీత్ (అనంతపురం)ను 21-5, 21-12తో, బి గిరీష్ నాయుడు (తూర్పు గోదావరి) సిహెచ్ గణేష్ (ప్రకాశం)ను 21-6, 21-10తో, ధాత్రేయరెడ్డి (కడప) కె మనోహర్ (కర్నూలు)ను 18-21, 21-17, 21-14తో, టి సాయికిషోర్ (పశ్చిమ గోదావరి) వై అమ్నన్నగౌడ్ (తూర్పు గోదావరి)పై, పి చంద్రపట్నాయక్ (విశాఖ) కె ప్రశాంత్‌కుమార్ (పశ్చిమ గోదావరి)పై, జి శివసుందరసాయి (చిత్తూరు) కార్తీక్ (కర్నూలు)పై, బి రోహిత్‌కుమార్ (విశాఖ) పిఎస్ సాయిదత్త (శ్రీకాకుళం)పై, ఆర్ ప్రయణ్ (విశాఖ) కె వరప్రసాద్ (విజయనగరం)పై, ఎస్‌వి రాయుడు (తూర్పు గోదావరి) కెరాహుల్ (కర్నూల్)పై, బి శరత్ (గుంటూరు) జి శ్రీఖర్ (అనంతపురం)పై, ఎ విద్యాసాయి (ప్రకాశం) వి విశ్వాంత్ (విశాఖ)పై విజయం సాధించారు. బాలికల్లో సింగిల్స్‌లో జి మేఘన (పశ్చిమ గోదావరి) ఎన్ జయశ్రీ (ప్రకాశం)పై, జి నివేదిత (విశాఖ) దీక్షితారాణి (అనంతపురం)పై, ఓ వెనె్నల (తూర్పు గోదావరి) షర్మిల (కర్నూలు)పై, వెనె్నల (కడప) బి యామినిశ్రీ (శ్రీకాకుళం)పై, వి షాన్‌విత (తూర్పు గోదావరి) ఎం మల్లిక (కర్నూలు)పై, జి బాలభువనేశ్వరి (విజయనగరం) డి హర్షిణి (పశ్చిమ గోదావరి)పై, జి లక్ష్మి (విశాఖ) బివిఎస్ పద్మజ (కర్నూలు)పై, పి నవ్యస్వరూప (తూర్పు గోదావరి) ఎన్ అంజలీ (ప్రకాశం)పై, టి సంజన (పశ్చిమ గోదావరి) ఖాశీబాయి (చిత్తూరు)పై, వై చరిష్మ (పశ్చిమగోదావరి) శ్రీలత (కడప)పై, డి ఐష్య (కర్నూలు) తేజ (తూర్పుగోదావరి)పై, జి స్వేత (అనంతపురం) ఎం సుష్మ (శ్రీకాకుళం)పై విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం అధ్యక్షుడు రెడ్డి మోహన్, గాలిదేవర పుల్లయ్యనాయుడు, భమిడిపాటి పాపయ్యశాస్ర్తీ, రెడ్డి శ్రీను, కడియం భాస్కర్, గుబ్బల మూర్తి, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.