తూర్పుగోదావరి

పాముకాటుతో గురుకుల పాఠశాల విద్యార్థికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, సెప్టెంబర్ 22: మండల పరిధిలో నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి గురువారం ఉదయం తరగతిలో పాముకాటుకు గురయ్యాడు. అంబాజీపేట గ్రామానికి చెందిన బీర సురేష్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఉదయం చదువుకునేందుకు బ్యాగ్‌లో పుస్తకాలు తీస్తుండగా పుస్తకాల మధ్యలో ఉన్న కట్లపాము కరవడంతో అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల హెల్త్‌సూపర్‌వైజయర్ బి దొరబాబు అస్వస్థతకు గురైన సుకుమార్‌కు ప్రాథమిక వైద్యం నిర్వహించి మెరుగైన చికిత్సకోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పి గన్నవరంలో అరకొర సౌకర్యాలతో అద్దె భవనంలో ఉన్న గురుకుల పాఠశాలను సుమారు 12 కోట్ల రూపాయలతో నరేంద్రపురం గ్రామంలో నిర్మించి ఆగస్టు నెలలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన భవనంలోకి మార్చడంతో ఇప్పుడైనా సుఖంగా చదువుకుంటారు అనుకుంటున్న తరుణంలో రెండు నెలలు కూడా గడవకుండానే విద్యార్ధి పాముకాటుకు గురికావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు విశ్మయం చెందారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ వివరణ ఇస్తూ పుస్తకాల బ్యాగులో పాము కరిచిందని విద్యార్థి తెలపడంతో వెంటనే పుస్తకాల బ్యాగును చూడగా అందులో కట్ల పాము ఉందని దానిని బయటకి తీసి చంపి వేసామని తెలిపారు. పాఠశాల హెల్త్ సూపర్ వైజర్, సిబ్బందితో కలసి సుకుమార్‌ను అమలాపురం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించామని 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారని ప్రిన్సిపాల్ తెలిపారు.