తూర్పుగోదావరి

రుణాల కల్పనకు బ్యాంకులు చొరవచూపాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 22: వివిధ కార్పొరేషన్‌ల ద్వారా లబ్దిదారులకు ఉపాధి యూనిట్లు, స్వయం సహాయ సంఘాల ఆర్ధిక కార్యక్రమాలు, చిన్నతరహా వ్యాపారాలు, వృత్తిదారులకు రుణాల కల్పనకు బ్యాంకులు మరింత చొరవతో ముందుకురావాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కోర్టుహాలులో గురువారం సాయంత్రం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులతో కలెక్టర్ జిల్లాస్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని 4251కోట్ల పంటరుణాలను కల్పించే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3922కోట్ల రుణాలను కల్పించి 92శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో లక్షా 30వేల మంది కౌలురైతులకు రుణ అర్హత కార్డులు జారీచేసి 45వేల 581మంది రైతులకు 97కోట్ల మేరకు పంటరుణాలను అందజేసినట్లు చెప్పారు. కౌలు రైతులకు రుణాల కల్పన మరింత సరళంచేస్తు వ్యవసాయ శాఖ ద్వార సాగు ధృవీకరణ పత్రాలను జారీకి ఆదేశించినట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిజేశారు. జిల్లాలో సాగుచేస్తున్న కౌలు రైతులందరకీ ఈపత్రాలను జారీచేసి రుణాలు అందేటట్లు చూడాలని, ఈనెలాఖరుకు మరో 30కోట్ల రుణాలను కౌలు రైతులకు అందజేయాలని కోరారు. జిల్లాలోని స్వయం సహాయ బృందాలకు ఈసంవత్సరం 1346కోట్ల రుణాల కల్పన లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 229కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. జిల్లాలో చిన్న వ్యాపారులు, వృత్తివ్యాపారులు అధిక వడ్డీ రుణాల ఊబిలో చిక్కుకోకుండా వర్కింగ్ కాపిటల్ కింద 5వేల నుండి 15వేల రూపాయల డిఆర్‌ఐ రుణాల కల్పనలో బ్యాంకులు మరింత చొరవచూపాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ప్రతీ బ్యాంక్ తమ బ్రాంచ్ నెలకు కనీసం వంద రుణాలను అందజేయాలని సూచించారు. చంద్రన్న బీమా పధకం కింద జిల్లాలో నమోదైన 17లక్షల మందిలో సుమారు 3లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు వచ్చేనెల 2వ తేదీలోపు తెరవాల్సి ఉంటుందన్నారు. బ్యాంక్ అధికారులు, డిఆర్‌డిఎ అధికారులు సమస్వయంతో అకౌంట్లను కల్పించి లబ్దిదారులు నష్టపోకుండా చూడాలని ఆయన తెలిపారు. వివిధ కార్పొరేషన్‌ల ద్వారా లబ్దిదారులకు యూనిట్ల గ్రాంటింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ సబ్సిడీనే లబ్దిదారులకు రుణాలుగా జారీచేసినట్లు చూపి, వాస్తవంగా రుణాలు జారీ ఎగవేసే బ్యాంకులు అవాంచిత పోకడలను ఎస్‌ఎల్‌బిసి, ఆర్‌బిఐల దృష్టికి తీసుకువెల్లనున్నట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ రుణాలకు అర్బన్ ఆస్తుల స్యూరిటీ చూపాలని కోరవద్దన్నారు. పరిశ్రమలకు రుణాల కల్పనలో జాప్యం నివారణకు సింగిల్ విండో వ్యవస్థలోకి బ్యాంకులను సైతం చేర్చేలా ఎస్‌ఎల్‌బిసిని కోరనున్నట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈసమావేశంలో పాల్గొన్న జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ స్వయం సహాయ బృందాల రుణాలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ రుణాలను త్వరితగతిన అందజేయాలని కోరారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు జారీచేసిన వాటిని మహిళలకు ఇవ్వకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచుకున్న బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ప్రత్తిపాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఆంధ్రాబ్యాంకు డిజియం ఆర్ బాస్కరరావు, ఎల్‌డిఎం బివి సుబ్రహ్మణ్యం, నాబార్డు ఎజిఎం కెవిఎస్ ప్రసాద్, ఆరిబిఐ ఎజిఎం సిబి గణేష్, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, వ్యవసాయశాఖ జేడి కెవిఎస్ ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల ఈడిలు, అధికారులు పాల్గొన్నారు.