తూర్పుగోదావరి

కాళ్లవాపులపై ప్రొఫెసర్ల బృందం పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, సెప్టెంబర్ 22: మండలంలో కాళ్ల వాపుల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం కింగ్‌జార్జి హాస్పటల్ ప్రొఫెసర్ల బృందం గురువారం రోగులపై పరిశోధన నిర్వహించారు. ఈ ప్రొఫెసర్ల బృందం స్థానిక రేఖపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి, ఆసుపత్రిలో ఉన్న రోగులను పరిశీలించారు. వ్యాధి లక్షణాలు, వారి ఆహారపు అలవాట్లు తదితర వివరాలన్నింటినీ సేకరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ కృష్ణమూర్తి, నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బాలమురళీకృష్ణ, ఎస్‌పిఎం డాక్టర్ దేవీ మాధవి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కాకినాడలో చికత్సను పొంది ఇళ్లకు వచ్చిన రోగులకు అడిషనల్ డిఎంహెచ్‌ఒ పవన్‌కుమార్ ఒక్కొక్కరికీ రూ.1500లు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే మరో ఆరుగురు కాళ్లవాపు రోగులను కాకినాడకు పంపించారు.