తూర్పుగోదావరి

విలీన మండలాల్లో వైద్య సేవలు విస్తృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 23: ఆంధ్రాలో విలీనమైన చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వైద్య సేవలు విస్తృతం చేసినట్టు చింతూరు ఐటిడిఎ పిఒ చక్రధరబాబు తెలిపారు. శుక్రవారం పిఒ చక్రధరబాబు స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో వైద్యాధికారులతో రోగుల గుర్తింపు, వైద్య సేవలు అందించడం తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా నియమించిన 12 మంది వైద్యాధికారులతో ప్రతి మండలానికి రెండేసి వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ వైద్య బృందాలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే గుర్తించిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం విలేఖరుల సమావేశంలో చక్రధరబాబు మాట్లాడుతూ కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు తెలిపారు. రోగాలతో బాధపడే వారు 285259 నంబరుకు ఫోన్‌చేస్తే రోగులను 108 అంబులెన్సు ద్వారా వైద్యశాలకు తరలించి వైద్యాన్ని అందించనున్నట్టు చెప్పారు. వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చింతూరు సిహెచ్‌సిలో అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రోగులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
సీతంపేట పిఒ పర్యవేక్షణ
విలీన మండలాల్లో వైద్య సేవలు పర్యవేక్షించేందుకు చింతూరు ఐటిడిఎ పిఒగా సీతంపేట పిఒ వెంకట్రావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దాంతో పిఒ వెంకట్రావు శుక్రవారం సాయంత్రం చింతూరు ఐటిడిఎలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగాల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.