తూర్పుగోదావరి

జిత్ మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ప్రభుత్వం తన బాధ్యతలను మర్చిపోయినపుడు ప్రజలే కొన్ని పనులకు నడుంబిగిస్తారన్నట్టుగా రాజమహేంద్రవరం పౌరులు తమను తాము సత్కరించుకున్నట్టుగా రాజమహేంద్రవరంలో ఒక భారీ పురస్కార కార్యక్రమానికి నడుం బిగించారు. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గాయకుడు, నటుడు, న్యాయవాది, క్రీడాకారుడు, సంఘ సేవకుడు, రాజకీయ నాయకుడు, తొలి ఆర్కెస్ట్రాకు ఆధ్యుడు అయిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీపాద జిత్ మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నగర పౌరులు, అభిమానులు నడుంబిగించడం విశేషత సంతరంచుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను నగర ప్రముఖులు పట్టపగలు వెంకటరావు, కృష్ణారావు, అశోక్‌కుమార్ జైన్ తదితరులు వెల్లడించారు.
రాజమహేంద్రవరం నగరంలోని నవరస నట సమాఖ్య తరపున ఈ పురస్కారాన్ని జిత్ మోహన్ మిత్రాకు ప్రదానం చేయనున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన శ్రీపాద జిత్ మోహన్ మిత్రా ఇప్పటి వరకు 210 చిత్రాల్లో నటించారని, గాయకుడుగా 65 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారని, గోదావరి తీరంలో తొలిగా ఆయన ఆర్కెస్ట్రా ప్రారంభించి 47 ఏళ్లుగా నిర్వహిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు 6 వేల ప్రదర్శనలు ఇచ్చారని, బహుముఖ ప్రజ్ఞాశాలిగా విభిన్న రంగాల్లో అయన అందించిన సేవలు గోదావరి తీరానికే గర్వకారణమని తెలిపారు. ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలను నిర్వహించిన జిత్ మోహన్ మిత్రాను జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం కళాకారులు తమను తాము సత్కరించుకోవడమే అన్నట్టుగా ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రతి మనిషి జీవితంలో అరుదైన ఈ పురస్కారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశామని తెలిపారు. అవార్డు స్వీకరించనున్న శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా మాట్లాడుతూ గాయం చేయని వాడు గాయకుడు కాదని నమ్మిన వాడినని, ఈ సత్కారాన్ని ప్రేమగా నిర్వహిస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు. అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ శ్రీపాద జిత్ మోహన్ మిత్రా గోదావరి తీరానికి గర్వకారణమన్నారు.