తూర్పుగోదావరి

బలహీనవర్గాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: బలహీన వర్గాలను బలవంతులుగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నారన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీ సంక్షేమానికి అందించే పెండింగ్ రుణాలను శుక్రవారం రాజమహేంద్రవరంలో మంత్రి విడుదల చేశారు. ఈ మేరకు 2014-15, 2015-16కు సంబంధించి పెండింగ్‌లో వున్న రూ.102 కోట్ల రుణాల చెక్కును అందించారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో చంద్రన్న బీసీ స్వయం ఉపాధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న లబ్ధిదారుల యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్య ద్వారా అసమానతలు రూపుమాసిపోతాయని పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల బాటతో ఎన్టీయార్ కృషిచేస్తే ఆయన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు గతంలో ఎపుడూ లేని విధంగా 96.7 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల కారణంగా ఈ విధమైన అభివృద్ధి సాధించారన్నారు. బీసీ హాస్టళ్లలో పనె్నండు మంది విద్యార్థులు 10-10 సాధించారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత, పింఛన్లు అందిస్తున్నారన్నారు. భారతదేశంలో వృద్ధి రేటు 7.7 శాతం ఉంటే ఎపి వృద్ధి రేటు 12.6 శాతానికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనన్నారు. కొంత మంది బీసీల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా వుండాలన్నారు. ఈ సభలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ జిల్లా కేంద్రంలోనూ బీసీ భవన్‌ల నిర్మాణానికి కేబినెట్‌లో ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. బీసీ భవన్‌ల నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనువుగా జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్‌లు నిర్మించుకోవాలని సూచించారు. అన్ని ఫెడరేషన్లు, కార్పొరేషన్ల నియమించారని, ఇంకా మరో ఐదు కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం తీసుకొచ్చింది టిడిపి అని అన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ళు పెట్టి ఉద్యోగావకాశాలు మెరుగుపర్చారన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీసీలకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. బలహీన వర్గాలకు టిడిపి ఎపుడూ అండగానే వుందన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు టిడిపి వచ్చిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందన్నారు. నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రన్నపాలనలో బీసీలకు స్వర్ణ యుగమన్నారు. గత పదేళ్ళలో బీసీలకు కేవలం రూ.70 కోట్లు కేటాయిస్తే ఈ రెండున్నరేళ్ళలో రూ.640 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ గత ఏడాది రూ.305 కోట్లు సబ్సిడీ రూపంలో నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అక్టోబర్ నుంచి పాత బకాయిలన్నీ క్లియర్ చేసుకుంటూ కొత్త రుణాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రెండేసి లక్షల రుణాల్లో లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రూ.30 లక్షల వరకు గ్రూపు రుణాలు అందివ్వనున్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మత్య్సకారులకు ప్రత్యేక రుణ ప్రణాళిక తయారు చేయాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత చేస్తున్నా రుణాలకు మాత్రం బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.రంగనాయకులు మాట్లాడుతూ ఇంకా రుణాలు పొందాల్సిన బీసీలంతా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సభ అనంతరం బీసీ సంఘాల నాయకులు, ఫెడరేషన్ ఛైర్మన్లు మంత్రి కొల్లు రవీంద్రను, దేవినేని ఉమా మహేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, ఫెడరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.