తూర్పుగోదావరి

జిల్లాలో ‘దోమల దండయాత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 25: ‘దోమలపై దండయాత్ర’ అనే ప్రభుత్వ నినాదం వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. దోమలపై దండయాత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమాటెలా ఉన్నా, వాటిపై పోరాడలేక, అలసి, సొలసి, విసిగివేశారిపోతున్న అధికారులను చూస్తే మాత్రం పాపం జాలేస్తోంది. ఒకవైపు దండయాత్రంటూ తిరుగుతున్న అధికారులకు మరోవైపు దోమల మోత చిర్రెత్తేలా చేస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడలో పరిస్థితిని గమనిస్తే, తమపై దోమల దండయాత్ర ఎప్పటిలాగే కొనసాగుతోందని, దోమలపై దండయాత్ర అని చెబుతుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావడం లేదని పలువురు వాపోతున్నారు.
వాస్తవానికి దోమల నిర్మూలననేది ఒక్క ప్రభుత్వ యంత్రాంగంతో సాధ్యమయ్యేది కాదన్నది నిర్వివాదాంశం! ఇందుకు ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిందే! అయితే వీటి నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్దేశించిన శాఖలకు కోట్లకు కోట్ల నిధులను మంజూరు చేస్తుండటం, శానిటేషన్ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రత్యేక ప్రభుత్వ విభాగాలున్నప్పటికీ వారింత వరకు ఈ సమస్య పరిష్కారానికి చేసిన కృషి ఏమిటన్న ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ప్రజారోగ్యం కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వం, దాని ఆధీనంలో పనిచేస్తున్న శాఖలే దీనికి సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ముఖ్య ప్రాంతాలతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను దోమల బెడద నిత్యం వేధిస్తూనే ఉంది. చివరకు గ్రామాలు, చిన్న చిన్న పల్లె వాసులు సైతం దోమలతో సహజీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీకి, పంచాయతీకి సరైన డంపింగ్ యార్డులు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ నేటికీ లేకుండా రహదారులు, ఇళ్ళముందు మురికి కుంటలు జుగుప్సా కరంగా కనిపిండం, ఆయా ప్రాంతాల్లో దోమల స్వైరవిహారం ఏలిన వారికి కనపడదా? అన్న ప్రశ్న జనం నుండి ఉదయిస్తోంది. ప్రభుత్వ పరంగా ముందు ఇటువంటి సమస్యలను పరిష్కరించి, తర్వాత ప్రజలు కూడా దండయాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తే సముచితంగా ఉంటుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా జిల్లాలో ప్రస్తుతం విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏజన్సీలో కాళ్ళ వాపుల వ్యాధి కలకలం రేపుతుండగా, మైదాన ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు దాదాపు జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరపీడితులు లెక్కకు మిక్కిలి బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తూ.తూ మంత్రంగా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాయకులకు ధీటుగా అధికారులు కూడా ఫొటోలకే ఫోజులిచ్చేందుకు పరిమితం అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోను చెత్త నిర్మూలనను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఈమేరకు అవసరమైన ట్రాక్టర్లు, జెసిబిలను వినియోగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే డంపింగ్ యార్డులు ఏర్పాటుచేసి, నివాస ప్రాంతాల్లో పెంట కుప్పలను తొలగించాలని కోరుతున్నారు. పరిశుభ్రమైన తాగునీటిని కూడా అందించి, తమ ఆరోగ్యాలను పరిరక్షించాలని మొరపెట్టుకుంటున్నారు.