తూర్పుగోదావరి

గోదావరి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది.మరో మూడు రోజుల్లో గోదావరి ఉద్ధృతి పెరగనుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా అవసరమైన అప్రమత్త చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద రెండు మీటర్ల వరకు నీటి మట్టం పెరిగింది. ఇక్కడ పెరిగిన నీటిమట్టం ధవళేశ్వరం వద్దకు చేరాలంటే మరో రెండు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఎట్టకేలకు శ్రీరాంసాగర్ రెండు మీటర్లకు పెరిగింది. ఈ నీరంతా గోదావరి నదికి రావాల్సి వుంది.
మానేరు, కడెం ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారడంతో గోదావరి నదిలో మరింతగా నీటి ఉద్ధృతి పెరగనుందని అంచనా వేస్తున్నారు. గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఆదివారం 8.7 అడుగుల మట్టం నమోదైంది. 2 లక్షల 41 వేల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ అన్ని గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి వేసి వరద జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 21 అడుగుల నీటి మట్టం నమోదైంది.
తాండవ రిజర్వాయర్‌కు జలకళ
కోటనందూరు, సెప్టెంబర్ 25: గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తాండవ రిజర్వాయరులో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈనెల 18 నాటికి కేవలం 362 అడుగులు ఉన్న నీటి మట్టం ఆదివారం నాటికి 370 అడుగులకు చేరుకుంది. గత పదిరోజులుగా తాండవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతమైన విశాఖ ఏజన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈవర్షపు నీరు పెద్ద ఎత్తున తాండవ రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతుంది. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం ఎనిమిది అడుగులు పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకొని మరో రెండు అడుగులు నీరు పెరిగే అవకాశం ఉందని తాండవ రిజర్వాయర్ అధికారులు భావిస్తున్నారు. తాండవ ఆయకట్టు పరిధిలోని తూర్పు విశాఖ జిల్లాల్లో పదిరోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో సాగునీటి ఎద్దడి లేనందున రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు నీటి సరఫరాను అధికారులు నిలుపుదల చేశారు. త్వరలో ఆయకట్టు రైతులతో నీటి అవసరంపై అభిప్రాయం సేకరించి నీటిని విడుదల చేస్తామని రిజర్వాయర్ అధికారులు తెలిపారు.