తూర్పుగోదావరి

వారంలో గ్రామాల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: కొత్త మాస్టర్‌ప్లాన్ అమల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని పరిసర గ్రామాల విలీన ప్రక్రియ ఈవారంలోగా పూర్తవుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెల్లడించారు. ఈనెల చివరివారంలో జరిగే కౌన్సిల్‌లో ఈమేరకు తీర్మానం చేయనున్నట్లు సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ రాజమహేంద్రవరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల విలీనానికి ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. విలీన గ్రామాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చర్యలు తీసుకుంటామన్నారు. విశాలమైన రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. భవన నిర్మాణాలు కూడా క్రమబద్ధంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సౌకర్యార్థం జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ నాటికి నగరపాలక సంస్థ కొత్త భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. పాత భవనాలను కూల్చివేసి, విశాలమైన పార్కింగ్, వాస్తురిత్యా ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఆత్రేయపురం, సెప్టెంబర్ 26: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలోని వెలిచేరు గ్రామంలో అనధికార ర్యాంపు నుండి ఇసుక తరలిస్తుండగా వీటిని సీజ్ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.
ప్రజావాణికి 183 ఫిర్యాదులు
కాకినాడ, సెప్టెంబర్ 26: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా హాజరై సుమారు 183 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ విజ్ఞాపనలను, ఆర్జీలను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు అందించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీలను కలెక్టర్‌తో పాటు జెసి ఎస్ సత్యనారాయణ, జెసి-2 జె రాధాకృష్ణమూర్తిలు తీసుకున్నారు. అందిన వాటిని పరిశీలించిన సంబంధిత అధికారిని పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ప్రజావాణిలో జిల్లాకు చెందిన వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.