తూర్పుగోదావరి

పురుగు మందుల షాపులపై విజిలెన్స్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, సెప్టెంబర్ 27: గొల్లప్రోలు మండలం దుర్గాడ, వనె్నపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగుమందుల షాపులపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు షాపులకు లైసెన్సులు లేకపోవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సుమారు 12 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులు సీజ్ చేశారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారం మేరకు విజిలెన్సు అధికారులు రెండు బృందాలుగా విడిపోయి దుర్గాడ, వనె్నపూడి గ్రామాల్లో షాపులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుర్గాడలో గుండ్ర వెంకన్న అనే వ్యక్తి లైసెన్సు లేకుండా ఎరువులు,పురుగు మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుండి 62 వేల రూపాయల విలువైన 144 ఎరువుల బస్తాలు, 53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. దుర్గాడలో సూర్య ఏజన్సీస్‌లో తనిఖీలు జరపగా ఎరువుల విక్రయానికి అనుమతి లేనట్లు గుర్తించారు. దీనితో రూ.20 వేల విలువైన ఎరువులు, రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు సీజ్ చేసారు. వనె్నపూడిలో కెవిఆర్ ఏజన్సీస్‌లో తనిఖీలు జరపగా స్టాకుకు రికార్డులకు వ్యత్యాసం ఉండటంతో 1.82 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసారు. 7.18 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసారు.సదరు షాపుల యజమానులపై కేసులు నమోదు చేసారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐలు గౌస్ బేగ్, ఎన్ భాస్కరరావు, ఎఒ శ్రీనివాస్, బివిఆర్ కుమార్ పాల్గొన్నారు.