తూర్పుగోదావరి

త్వరితగతిన ఏలేరు ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 27: ఏలేరు కాలువ ఆధునికీకరణ, భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో జెసి మాట్లాడారు. ఏలేరు ఎడమ కాలువ మోడరైజేషన్‌కు భూసేకరణ నిమిత్తం 13 గ్రామాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మిగిలిన రెండు గ్రామాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని కాకినాడ ఆర్డీవో అంబేద్కర్‌ను ఆదేశించారు. కిర్లంపూడి, గెద్దనాపల్లి, ముక్కొల్లు, రాజుపాలెం, చిల్లంగి గ్రామాల భూసేకరణలో నివాస గృహాలు ఎక్కువ పోకుండా మార్జిన్ ఇవ్వాలని వైఎ డివిజన్ అధికారికి సూచించారు. భూసేకరణ కోసం రైతుల నుండి భూరికార్డులను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టరేట్‌కు పంపాలని స్పష్టం చేశారు. సామర్లకోట-రాజానగరం ఎడిబి రోడ్డు భూసేకరణకు సంబంధించి సర్వే పూర్తయిందన్నారు. కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు భూసేకరణ పనులు పూర్తయ్యాయని జెసి తెలిపారు. వేమగిరి, కేశవరం, సర్పవరం, మేడపాడు గ్రామాల్లో దేవాదాయ శాఖకు చెందిన భూములను తీసుకున్నందున, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములను గుర్తించి ఆ శాఖకు బదలాయించాలని సూచించారు. కెనాల్ రోడ్డులో గల దేవాలయాలను తొలగించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పోలవరం ఎడమకాలువకు అడ్డుగా ఉన్న తుని కుమ్మరి కాలనీని వేరే చోటకు తరలించి, కాలువ పనులను వేగవంతం చేయాలని పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావుకు సూచించారు. దేవాదాయ శాఖాధికారి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.