తూర్పుగోదావరి

సోషల్ మీడియాతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 18: విద్యార్థులు సోషల్ మీడియా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కాకినాడలో ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 6 వేల మంది విద్యార్థులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరై పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, విధులు, రికార్డుల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా నేరాలు జరిగిన సమయంలో క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు ఏ విధంగా సేకరిస్తారు, డ్రోన్ కెమెరాల నిర్వాహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతీ సంవత్సరం సుమారు ఏడువందల నుండి 1200 మంది వరకు పోలీసులు వివిధ రకాల సంఘటనల్లో మృతిచెందుతున్నారని తెలియజేశారు. ప్రజలకు భద్రత కల్పించే క్రమంలోనే పోలీసులు అమరులవుతున్నారన్నారు. విద్యార్థులందరూ కష్టించి చదివితేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్నారు. సోషల్ మీడియా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి ప్రభావానికి విద్యార్థులు గురై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ రవిప్రకాష్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్, ఎఆర్ డిఎస్పీ శ్రీవాసన్, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.