తూర్పుగోదావరి

రిజర్వేషన్ల సాధనకు గ్రామస్థాయి నుండి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 22: కాపు రిజర్వేషన్ సాధన కోసం గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు. శనివారం అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాపు రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు హామీలను తుంగలోకి తొక్కి కాపు యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కాపు జాబ్ మేళాకు 10 వేలకు పైగా నిరుద్యోగ కాపు యువత హాజరైతే పదిమందికి కూడా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఇటువంటి ఎత్తులు వేస్తున్నారన్నారు. రిజర్వేషన్ కోసం ముద్రగడ నాయకత్వంలో నవంబర్ 16న రావులపాలెం నుండి కాపు సత్యాగ్రహ యాత్ర 5 రోజులపాటు సాగుతుందన్నారు. రావులపాలెం నుండి అమలాపురం మీదుగా అంతర్వేది వరకూ ఈ ఉద్యమం నిర్వహించనున్నట్టు నల్లా తెలిపారు. దీనికోసం జిల్లా జెఏసి నుండి 30 మంది, నియోజకవర్గం నుండి 30 మంది, మండల, గ్రామస్థాయిలో 30 మంది చొప్పున జెఎసి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీరంతా ఉద్యమం నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడనే ప్రచారాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఆ పార్టీకి మేలు చేస్తున్నారన్న సంగతిని మర్చిపోతున్నారని నల్లా గుర్తుచేశారు. కాపు ఉద్యమం వెనుక ముద్రగడ, ఆయన వెనుక రాష్ట్ర కాపులంతా ఉన్నారని, మరే పార్టీ లేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నామే తప్ప, కొత్తగా ఏమీ కోరడంలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నిమ్మకాయల చినరాజప్ప రిజర్వేషన్ల కోసం పోరాడిన మొదటి వ్యక్తని, అధికారంలోకి వచ్చిన తరువాత తన పదవిని కాపాడుకోవడానికి చంద్రబాబుకి వంత పలకడంపై నల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నవంబర్ 16న రావులపాలెం నుండి నిర్వహించనున్న సత్యాగ్రహ పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నల్లా పవన్, మామిడిపల్లి రాజారావు, అరిగెల సత్యనారాయణ, మామిడిపల్లి రాంబాబు, సలాది కోటేశ్వరరావు, గొలకోటి బుట్టో, సాధనాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.