తూర్పుగోదావరి

అబ్బురపరిచిన సూక్ష్మస్వర్ణ విహంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు, అక్టోబర్ 23: మండల కేంద్రమైన బిక్కవోలుకు చెందిన స్వర్ణకారుడు అంబరపు శ్రీనివాస్ బంగారంతో రూపొందించిన హెలికాప్టర్ చూపరులకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. 2 గ్రాముల, 700 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజుల పాటు శ్రమించి తయారుచేసిన అతిచిన్న ఈ నమూనా విహంగం అంగుళం లోపు ఎత్తు, అంగుళం పొడవు పరిమాణంలో బొటన వేలి గోరు సైజులో రూపొందించారు. గతంలోను కేవలం 200 మిల్లీగ్రాముల బంగారంతో చేతి గడియారంలో ఇమిడిపోయే పరిమాణంలో సైకిల్‌ను రూపొందించిన శ్రీనివాస్ గిన్నీస్ రికార్డు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. ఈ సందర్భంగా శ్రీను కళానైపుణ్యాన్ని పలువురు ప్రశంసించారు.